Saturday, May 11, 2024

డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్‌ను టిస్ నాబ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 264 ఎక్టసీ(ఎండి) పిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్,టిఎస్ నాబ్ డైరెక్టర్ సివి ఆనంద్ హెచ్‌ఐసిసిసిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నైజీరియా దేశానికి చెందిన డేవిడ్ హుకా అలియాస్ పాస్టర్ డేవిడ్ బార్బర్‌గా పనిచేస్తుంటాడు. నిందితుడు ఎనిమిది ఏళ్ల క్రితం ఇండియాకు వచ్చాడు. అప్పటి నుంచి బెంగళూరులో మకాం వేశాడు. తర్వాత వివిధ పేర్లు మార్చుకుని డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చాక పేరు మార్చుకుని, ఫేక్ వీసా, ఫేక్ ఐడితో సిమ్‌కార్డులు తీసుకుని డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నాడు. ఇంటర్నేషనల్ సిమ్‌కార్డులు వాడితే పోలీసులు పట్టుకుంటారని నకిలీ పేర్లతో సిమ్ కార్డులు తీసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు.

ఆల్ ఇండియా నైజీరియన్ స్టూడెంట్ కమ్యూనిటీ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశాడు. దీని ద్వారా డ్రగ్స్, గంజాయి కేసులో అరెస్టయిన నైజీరియన్లకు బెయిల్ ఇప్పించి వారి దేశానికి పంపిస్తున్నాడు. మతప్రార్థనల పేరు చెప్పి హైదరాబాద్‌లో పలువురుకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. నిందితుడు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తరచూ వచ్చి ఇక్కడ డ్రగ్స్ విక్రయిస్తున్నాడు. ఈ విషయం కొద్ది రోజుల క్రితం కాచీగూడ, కెపిహెచ్‌బి పోలీసులు కేసులు నమోదు చేయడంతో బయటికి వచ్చింది. దీంతో ప్రధాన నిందితుడి కోసం గాలించి బెంగళూరులో పట్టుకున్నారు. నిందితుడి పేరుపై ఉన్న రూ.4కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకోనున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. డిసిపి చక్రవర్తి గుమ్మి, ఇన్స్‌స్పెక్టర్ రమేష్ రెడ్డి తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News