Home తాజా వార్తలు సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం: 11 గుడిసెలు దగ్ధం

సికింద్రాబాద్‌లో అగ్నిప్రమాదం: 11 గుడిసెలు దగ్ధం

fire-accident, 11 huts burst Due to gas cylinder blast at Secunderabad

హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని బాపూజీనగర్ లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ఓ గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చేలరేగడంలో మరో 10 గుడిసెలు కాలి బూడిదయ్యాయి. చుట్టుపక్కల ఇళ్లకు మంటలు వ్యాపంచడంతో స్థానికులు భయందోళనకు గురవుతున్నారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తినష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. బాధితులు కట్టుబట్టలతో బోరున విలపిస్తున్నారు. స్థానికుల సమాచారంతో హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

fire