Sunday, April 28, 2024

దేశంలో ఒక్కరోజే 1133 మంది మృత్యువాత

- Advertisement -
- Advertisement -
1133 deaths in a single day in the country
ఒక్కరోజే 75,809 మందికి కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ: వరుసగా గడచిన రెండురోజులు 90 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా గత 24 గంటల్లో దేశంలో 75,809 మంది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మంగళవారం నాటికి కరోనా కేసుల సంఖ్య 42,80,422కి చేరుకుంది. కాగా.. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1133 కరోనా సంబంధిత మరణాలు చోటుచేసుకున్నాయి. దీంతో మరణాల సంఖ్య 72,775కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి శాతం 77.65 శాతానికి పెరిగిందని, దేశంలో మొత్తం 33,23,950 మంది కరోనా రోగులు కోలుకున్నారని కేంద్రం తెలిపింది. మరణాల శాతం 1.7 శాతం ఉందని కూడా పేర్కొంది. దేశంలో ప్రస్తుతం 8,83,697 యాక్టివ్ కేసులు ఉన్నాయని, మొత్తం నమోదైన కేసుల సంఖ్యలో ఇది 20.65 శాతమని ప్రభుత్వం వివరించింది. ఆగస్టు 7న దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు ఆగస్టు 23 నాటికి 30 లక్షలు దాటాయని, సెప్టెంబర్ 5 నాటికి 40 లక్షలు దాటాయని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. సోమవారం ఒక్కరోజే 10,98,621 నమూనాలకు పరీక్షలు జరిగాయని, దీంతో దేశంలో ఇప్పటివరకు 5,06,50,128 టెస్టింగులు జరిగాయని ఐసిఎంఆర్ పేర్కొంది.

గడచిన 24 గంటల్లో సంభవించిన 1133 మరణాలలో మహారాష్ట్రలో అత్యధికంగా 423 చోటుచేసుకున్నాయి. కర్నాటకలో 141, తమిళనాడులో 89, ఆంధ్రప్రదేశ్‌లో 70, పంజాబ్‌లో 61, పశ్చిమ బెంగాల్‌లో 58, ఉత్తర్ ప్రదేశ్‌లో 56, ఢిల్లీలో 32, హర్యానాలో 23, మధ్యప్రదేశ్, జమ్మూ కశ్మీరులో 17 చొప్పున, ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌లో 15 చొప్పున, రాజస్థాన్‌లో 14, జార్ఖండ్‌లో 13, కేరళలో 12, పుదుచ్చేరి, బీహార్, తెలంగాణలో 11 చొప్పున, అస్సాం, ఒడిశాలో 10 చొప్పున, గోవాలో 9, ఉత్తరాఖండ్‌లో 7, చండీగఢ్, త్రిపురలో 3 చొప్పున, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయాలో ఒకటి చొప్పున మరణాలు చోటుచేసుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News