Friday, April 26, 2024

బెంగళూరు ఎయిర్‌పోర్టులో కరోనా కలకలం..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: స్థానిక కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన 12మంది ప్రయాణికులకు కోవిడ్ 19 వైరస్ ఉన్నట్లు పరీక్షల క్రమంలో నిర్థారణ అయింది. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న పలు దేశాల నుంచి వచ్చినవారే కోవిడ్‌కు గురయినట్లు స్పష్టం అయింది. వీరిలో చైనా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడికి కూడా కోవిడ్ 19 ఉన్నట్లు నిర్థారణ కావడంతో బెంగళూరులో ఉన్నత స్థాయిలో అధికారులు అప్రమత్తం అయ్యారు. విదేశాల నుంచి వస్తున్న వారికి రాండమ్ పరీక్షలను కేంద్రం ఇటీవలే తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో ప్రత్యేకించి కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి నిశిత పరీక్షల తరువాతనే ఇళ్లకు వెళ్లేందుకు అనుమతిని ఇస్తున్నారు.

ఈ క్రమంలో పలు విమానాలలో వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించగా ఓకేసారి డజన్ మందికి కరోనా ఉన్నట్లు తేలడంతో బెంగళూరులో అంతా అప్రమత్తం అయ్యారు. చైనా నుంచి వచ్చిన ఓ 37 ఏండ్ల వ్యక్తికి కూడా కరోనా ఉన్నట్లు తేలింది. మిగిలిన 11 మంది వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాలలలో పర్యటించి వచ్చిన వారే. కరోనా సోకినట్లు నిర్థారణ అయిన వారిని చికిత్సకు పంపించగా మిగిలిన వారిని హోం క్వారంటైన్‌కు తరలించారు.

కరోనా నిర్థారణ అయిన వారి రక్తనమూనా పరీక్షల శాంపుల్స్‌ను వెంటనే వైరాలజీ ఇనిస్టూట్‌కు పరీక్షలకు పంపించారు. వీటి ఫలితాలు వస్తే వైరస్ తీవ్రత ఏమిటనేది తేలుతుంది. శనివారం చైనా నుంచి యుపిలోని ఆగ్రాకు వచ్చిన ఓ వ్యక్తికి వైరస్ ఉన్నట్లు తేలడంతో వెంటనే ఆయనను క్వారంటైన్‌కు పంపించారు. ప్రస్తుత చైనా వైరస్ భయాల దశలో విదేశాల నుంచి వచ్చే వారి విషయంలో భారీ స్థాయిలో పరీక్షలకు ఏర్పాట్లు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News