Sunday, May 12, 2024

శ్రీలంకలో భారీ వర్షాలు.. 14 మంది మృతి

- Advertisement -
- Advertisement -

14 killed in Sri Lanka floods

కొలంబో: శ్రీలంకలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో ఇప్పటివరకు 14 మంది మృత్యువాతపడ్డారు. 800 పైగా ఇళ్లు ధ్వంసం కాగా, 240,000 నిరాశ్రయులు అయ్యారు. ఇప్పటివరకు 15వేల మందికిపైగా సురక్షిత ప్రాంతాలకు తరలించారని అధికారులు తెలిపారు. గురువారం రాత్రి నుండి పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అనేక ఇళ్ళు, వరి పొలాలు, రోడ్లు నీటిలో మునిగిపోయాయి. ట్రాఫిక్ భారీ అంతరాయం ఏర్పడింది. 3500 కుటుంబాలను సహాయ శిబిరాల్లో ఉంచామని జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం చీఫ్ మేజ్ జనరల్ సుదాంత రణసింగ్ తెలిపారు. ఈ కుటుంబాల నుండి నిరాశ్రయులైన 15 వేల మందికి వసతి కల్పించడానికి 72 సహాయ శిబిరాలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. వరదల్లో 10 మంది మరణించగా, నలుగురు బురదలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. గంపా, కొలంబో, రత్నపుర, కేగల్లెతో సహా పలు జిల్లాలను కుండపోత వర్షాలు పడ్డాయి. రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

14 killed in Heavy rains in Sri Lanka

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News