Saturday, April 27, 2024

91 శాతానికి పెరిగిన రికవరీ రేటు

- Advertisement -
- Advertisement -

1481 covid-19 cases and four deaths in telangana

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా రికవరీ రేట్ 91 శాతానికి పెరిగింది. వైరస్ బారిన పడిన వారంతా వేగంగా కోలుకోవడంతోనే రికవరీ రేట్ రోజురోజుకు పెరుగుతోందని అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 91.78 శాతానికి నమోదు అయింది. అయితే ఇది దేశ సగటు 90.7 కంటే అదనంగా తేలడం గమనార్హం. ఇదిలా మంగళవారం 40,081 టెస్టులు చేయగా 1481 పాజిటివ్‌లు తేలాయి.

వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 279 ఉండగా, ఆదిలాబాద్‌లో 16, భద్రాద్రి 79,జగిత్యాల 38, జనగాం 24, భూపాలపల్లి 17, గద్వాల 12, కామారెడ్డి 38, కరీంనగర్ 79,ఖమ్మం 82, ఆసిఫాబాద్ 9 , మహబూబ్‌నగర్ 35 , మహబూబాబాద్ 33, మంచిర్యాల 24, మెదక్ 23, మేడ్చల్ మల్కాజ్‌గిరి 138, ములుగు 20, నాగర్‌కర్నూల్ 27, నల్గొండ 82, నారాయణపేట్ 4, నిర్మల్ 21, నిజామాబాద్ 32, పెద్దపల్లి 26, సిరిసిల్లా 27, రంగారెడ్డి 111, సంగారెడ్డి 32, సిద్ధిపేట్ 34, సూర్యాపేట్ 47, వికారాబాద్ 13, వనపర్తి 0, వరంగల్ రూరల్ 24, వరంగల్ అర్బన్ లో 45, యాదాద్రిలో మరో 10 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,34,152 కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,14,917కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.

ప్రతి పది లక్షల్లో లక్షా 11 వేల మందికి పరీక్షలు…

రాష్ట్రంలో కరోనా టెస్టులు భారీ సంఖ్యలో జరుగుతున్నాయి. ప్రతి పది లక్షల్లో ఏకంగా లక్షా 11 వేల మందికి టెస్టులు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను మరింత రెట్టింపు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.

రెండు లక్షల 14 వేల మంది కోలుకున్నారు…

రాష్ట్ర వ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారిలో ఏకంగా రెండు లక్షల 14వేల మంది కోలుకున్నట్లు హెల్త్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడం వలనే ఇది సాధ్యమైనట్లు హెల్త్ డైరెక్టర్ పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు వైరస్ బారిన పడిన వారిలో 1,63,906 మంది అసింప్టమాటిక్ ఉండగా, మరో 70,246 మందికి లక్షణాలతో పాజిటివ్ తేలినట్లు వైద్యాధికారులు తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 7304, ప్రైవేట్‌లో 7063 బెడ్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

వైరస్ తగ్గిపోయిందని నిర్లక్షంగా ఉండొద్దుః హెల్త్ డైరెక్టర్

రాష్ట్రంలో కేసులు తగ్గినప్పటికీ, వైరస్ ముప్పు పూర్తిగా పోలేదని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు ప్రకటించారు. చలి కాలం పూర్తయ్యే వరకు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. జలుబు, దగ్గు, జ్వరం తదితర ఏ లక్షణాలు ఉన్నా వెంటనే కోవిడ్ పరీక్ష చేపించుకోవాలని ఆయన తెలిపారు. అదే విధంగా బయటకు వెళ్లే టపుడు ప్రతిసారి మాస్కు తప్పనిసరి అని తెలిపారు. అంతేగాక ఏ వస్తువు తాకినా, ఎవరిని ముట్టుకున్నా, సబ్బుతో కానీ, శానిటైజర్‌తో కానీ చేతులను శుభ్రం చేసుకోవాలని ఆయన కోరారు. అంతేగాక వ్యక్తికి, మరో వ్యక్తికి కనీసం ఆరు ఆడుగుల భౌతిక దూరాన్ని పాటించాలన్నారు. వీలైనంత వరకు గుంపులు, జనసమ్మర్థ ప్రాంతాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లొద్దన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News