Tuesday, April 30, 2024

నవంబర్‌లో బ్యాంకులకు 15 పని దినాలే..

- Advertisement -
- Advertisement -

11వ తేదీ నుంచి 14 వరకు వరుస సెలవులు

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఖాతాలు నిర్వహిస్తుండటం సహజం. లావాదేవీలన్నీ డిజిటల్ మయమైనా.. ఖాతాదారులు బ్యాంకు శాఖలకు వెళ్లాల్సిన అవసరం వస్తుంది. ప్రస్తుత తరుణంలో సమయం ఎంతో కీలకం.. కనుక బ్యాంకులకు వెళ్లే రోజు సెలవులు ఉన్నాయా? లేవా? అన్న సంగతి తెలుసుకుంటే.. బ్యాంకింగ్ లావాదేవీలు, వ్యవహారాలు చక్కబెట్టుకోవచ్చు. బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చిన సెలవుల ప్రకారం 15 రోజులూ సెలవులే. నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కలిపి ఆరు సెలవులు.. అదనంగా పండుగలు, గెజిటెడ్, బ్యాంక్ సెలవులు, ప్రాంతీయ, రాష్ట్రాల వారీ సెలవులు కలుపుకుని తొమ్మిది రోజులు బ్యాంకులు పని చేయవు.

నవంబర్ నెలలో బ్యాంకులకు సెలవులు ఇలా.. : ఒకటో తేదీ కన్నడ రాజ్యోత్సవం, కుట్, కర్వా చాట్ సందర్భంగా కర్ణాటక, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు, 10వ తేదీ : వంగ్లాలా పండుగ సందర్భంగా అగర్తల, డెహ్రాడూన్, గ్యాంగ్ టక్, ఇంఫాల్, కాన్ఫూర్, లక్నో నగరాల్లో సెలవు, నవంబర్ 11- నుంచి 14 మధ్య నాలుగు రోజులు వరుసగా బ్యాంకులకు సెలవు. 11న రెండో శనివారం, 12న ఆదివారం వారాంతపు సెలవు. 13, 14 తేదీల్లో నరక చతుర్థి, దీపావళి సందర్భంగా అత్యధిక నగరాల్లో బ్యాంకులకు సెలవు. లక్ష్మీపూజ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో 15న బ్యాంకులకు సెలవు. 20న ఛాత్ పూజ సందర్భంగా బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు.
23న ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. 27న గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా సెలవు.30న కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో సెలవు.

వారాంతపు సెలవులు ఇలా .. నవంబర్ 5, 12,19,26వ తేదీలు ఆదివారం కాగా, నవంబర్ 11, 25వ తేదీలు : రెండో, నాలుగో శనివారాలు కావడంతో పాటు వివిధ పండుగల సందర్భంగా నవంబర్ నెలలో బ్యాంకులకు రిజర్వ్‌బ్యాంక్ 15 రోజులు సెలవులు ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News