Sunday, April 28, 2024

జిల్లాల్లో మళ్లీ పెరుగుతున్న కరోనా తీవ్రత

- Advertisement -
- Advertisement -

1536 New Covid-19 Cases Reported in Telangana

హైదరాబాద్: రాష్ట్రంలో మరో 1536 పాజిటివ్‌లు నమోదయ్యాయి. వీటిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 281 ఉండగా ఆదిలాబాద్‌లో 20, భద్రాద్రి 123,జగిత్యాల 37, జనగాం 18, భూపాలపల్లి 19, గద్వాల 8, కామారెడ్డి 38, కరీంనగర్ 76 ,ఖమ్మం 97, ఆసిఫాబాద్ 7, మహబూబ్‌నగర్ 22 ,మహబూబాబాద్ 24, మంచిర్యాల 37, మెదక్ 21, మేడ్చల్ మల్కాజ్‌గిరి 96, ములుగు 26, నాగర్‌కర్నూల్ 32, నల్గొండ 81, నారాయణపేట్ 8, నిర్మల్ 22, నిజామాబాద్ 32, పెద్దపల్లి 31 , సిరిసిల్లా 33, రంగారెడ్డి 92, సంగారెడ్డి 21, సిద్ధిపేట్ 30, సూర్యాపేట్ 47, వికారాబాద్ 22, వనపర్తి 32, వరంగల్ రూరల్ 23, వరంగల్ అర్బన్ లో 49, యాదాద్రిలో మరో 31 మందికి వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2,42,506కి చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 2,23,413కి చేరింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 16, ప్రైవేట్‌లో 44 కేంద్రాల్లో ఆర్‌టిపిసిఆర్ టెస్టులు నిర్వహిస్తుండగా,1076 సెంటర్లలో యంటీజెన్ టెస్టులు నిర్వహిస్తున్నామని హెల్త్ డైరెక్టర్ తెలిపారు.

జిల్లాల్లో మళ్లీ పెరుగుతున్న కరోనా తీవ్రత…

జిల్లాల్లో కరోనా తీవ్రత మళ్లీ స్వల్పంగా పెరుగుతోంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో రెండు రోజుల నుంచి కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల జరిగిన పండుగల్లో ప్రజలంతా బహిరంగా ప్రదేశాల్లో ఎక్కువగా తిరడంతోనే కేసులు పెరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. దీంతో ఈ జిల్లా ప్రజల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యశాఖ సూచిస్తుంది.

1350 దాటిన కరోనా మరణాలు…

రాష్ట్రంలో కరోనా మరణాలు 1351కి చేరుకున్నాయి. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర డెత్ రేట్ అతి స్పల్పంగా తేలుతుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 0.55 శాతం డెత్ రేట్ నమోదు కాగా, ఇది దేశ సగటు 1.5 శాతం కంటే చాలా తక్కువగా రికార్డు అవుతోంది.

1,69,754 మంది అసింప్టమాటిక్ పేషెంట్లే….

రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారిలో ఏకంగా 1,69,754 మంది అసింప్టమాటిక్ పేషెంట్లు ఉన్నట్లు ఉన్నారు. అంటే మొదటి దశలో వైరస్ తీవ్రత తక్కువగానే ఉందని ఎక్స్‌పర్ట్ చెబుతున్నారు. కానీ సెకండ్ వేవ్‌లో అసింప్టమాటిక్ పేషెంట్లు వీటి కంటే అధికంగా తేలి, ఇన్‌ఫెక్షన్ రేట్‌ను అమాతంగా పెంచుతుందని ఆరోగ్యశాఖ అంచనా వేసింది. కావున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెల్త్ డైరెక్టర్ మరోసారి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News