Thursday, May 9, 2024

ఎన్నికల వేళ ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

US Judge Blocks Trump Immigration Rule

చికాగో: అధ్యక్ష ఎన్నికలకు కొద్ది గంటల ముందు ట్రంప్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. చట్టబద్ధ వలసదారులు తమ గ్రీన్‌కార్డులను ఆహార స్టాంప్‌లు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు పొందడానికి వాడకుండా నిషేధిస్తూ ఆయన ప్రభుత్వం తీసుకున్న కీలక ఇమిగ్రేషన్ నిబంధనను చికాగోలోని ఫెడరల్ జడ్జి ఒకరు సోమవారం కొట్టేశారు. ఇమిగ్రేషన్ విధానంపై స్టే విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు ఉపసంహరించుకోవడంతో ఇటీవలే ఈ ఉత్తర్వు అమలులోకి వచ్చింది. అయితే యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి గారీ ఫీనర్‌మ్యాన్ ఈ ఉత్తర్వును కొట్టివేశారు. ఈ ఉత్తర్వు అడినిస్ట్రేటివ్ యాక్ట్‌కు విరుద్ధమైనదని జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు. ఇల్లినాయిస్ వలసదారులు, శరణార్థుల హక్కుల కూటమి, కుక్ కౌంటీతో పాటుగా పలువురు ఉత్తర్వులను సవాలు చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశాయి. కాగా జడ్జి ఉత్తర్వులు దేశమంతా వర్తిస్తుంది.

US Judge Blocks Trump Immigration Rule

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News