Tuesday, May 14, 2024

డిక్యూ కంపెనీ ఎండిపై హెచ్‌ఆర్‌సిలో ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

Complaint in HRC against DQ Entertainment International Pvt

 

ఎండిపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగుల మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు
ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వడంలేదని ఆవేదన

మనతెలంగాణ, హైదరాబాద్ : ఆరు నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడంతో ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులు మానవహక్కుల కమిషన్‌ను మంగళవారం ఆశ్రయించారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిక్యు ఎంటర్‌టైన్‌మెంట్ ఇంటర్ననేషన్ ప్రైవేట్ కంపెనీ( యానిమేషన్) ఎండిగా తపాస్ చక్రవర్తి ఉన్నారు. కరోనా వల్ల వ్యాపారం లేకపోవడంతో గత ఆరు నెలల నుంచి వేతనాలు ఇవ్వడంలేదు. సంస్థలో పనిచేస్తున్న సుమారు 1,400మంది ఉద్యోగులు ఒక్కొక్కరికి రూ.14లక్షల వరకు రావాల్సి ఉంది. ఉద్యోగులు వేతనాల కోసం అడిగితే వేధిపులకు గురిచేస్తున్నాడని, ఉద్యోగం నుంచి తీసివేస్తానని ఎండి చక్రవర్తి వేధింపులకు గురిచేస్తున్నాడని ఉద్యోగులు మానవహక్కుల కమిషన్‌కు విన్నవించుకున్నారు. ఎండి పాస్‌పోర్టు సీజ్ చేసి, తమకు జీతాలు ఇచ్చి న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఎండి చక్రవర్తిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఉద్యోగులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News