Tuesday, May 7, 2024

కరోనా హాట్‌స్పాట్‌లో 170 జిల్లాలు

- Advertisement -
- Advertisement -

 Corona Hotspot

 

హాట్‌స్పాటేతర జిల్లాలుగా 207, మిగతావి గ్రీన్‌జోన్‌లో
దేశవ్యాప్తంగా 12వేలకు చేరుకున్న కరోనా రోగులు
మృతులు 392, సామూహిక వ్యాప్తి జరగడంలేదు
24 గంటల్లో 1,118 కేసులు నమోదు : కేంద్రం ప్రకటన

న్యూఢిల్లీ: దేశంలో 170 జిల్లాలను కరోనా హాట్‌స్పాట్లుగా గుర్తించారు. 207 జిల్లాలను తక్కువ స్థాయి ప్రభావిత లేదా హాట్‌స్పాటేతర జిల్లాలుగా పరిగణిస్తారు. ఈ విషయాన్ని కేం ద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ బుధవారం విలేకరులకు తెలిపారు. ఈ రెండు జోన్ల పరిధిలోకి రాని జిల్లాలు గ్రీన్‌జోన్ల పరిధిలోకి వస్తాయి. దేశం లో ఇప్పటికైతే వైరస్ సామూహిక సంక్రమణ దశ ఏదీ లేదని స్పష్టం చేశారు. దేశంలో కరోనాతో ఇప్పటివరకూ మృతుల సంఖ్య 377కి చేరిందని వివరించారు. కరోనా జోన్ల విషయంలో రాష్ట్రాలకు కేంద్రం తగు మార్గదర్శకాలను వెలువరించింది. అత్యధిక కేసులు నమోదయిన జిల్లాలను హాట్‌స్పాట్లుగా, కొన్ని కేసు లు నమోదయిన జిల్లాలను నాన్ హాట్‌స్పాట్ జిల్లాలుగా , అసలు ఏ కేసూ లేని జిల్లాలను గ్రీన్‌జోన్లుగా గుర్తించాలని రాష్ట్రాలకు సూచించారు. వీటినే రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా కూడా వర్గీకరించారు. జోన్లను ప్రాతిపదికగా చేసుకుని వైరస్ వ్యాప్తిని కట్టడి చేసుకోవల్సి ఉంటందని అన్నారు. లాక్‌డౌన్ దశను కరోనా కట్టడికి సదవకాశంగా ఎంచుకుంటే మంచిదని తెలిపారు.

అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డిజిపిలు, ఆరోగ్య కార్యదర్శులు, ఎస్‌పిలు, మున్సిపల్ కమిషనర్లు, సిఎంఒలతో కేబినెట్ సెక్రెటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు, కరోనా వ్యాప్తి నిరోధానికి క్షేత్రస్థాయిలో చర్యలను అందరితో సమీక్షించినట్లు తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలో ప్రజలను కేవలం నిత్యావసర సరుకుల కోసమే అనుమతించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తిరనివ్వరాదని తెలిపారు. సామూహిక వ్యాప్తి దశ రాకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టాల్సి ఉంటుందని రాష్ట్రాల అధికారులను కేంద్ర కేబినెట్ సెక్రెటరీ ఆదేశించారు. బుధవారానికి దేశంలో కరోనా ప్రభావంతో మృతుల సంఖ్య 392కు చేరింది. ఇక గడిచిన 24 గంటలలో కొత్తగా నమోదైన కేసులు 1118, దీనితో మొత్తం కరోనా రోగుల సంఖ్య 11,933కి చేరిందని ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారులు బుధవారం తెలిపారు.

తమిళనాడులో 22హాట్‌స్పాట్లు.. తెలంగాణలో 9
దేశం మొత్తం మీద తమిళనాడులో 22 హాటుస్పాటు జిల్లాలను గుర్తించారు. తరువాతి క్రమంలో మహారాష్ట్రలో 14, యుపిలో 13, రాజస్థాన్‌లో 12, ఆంధ్రప్రదేశ్‌లో 11, ఢిల్లీలో 10 హాట్‌స్పాట్లను గుర్తించారు. తెలంగాణలో 600 కరోనా కేసులు నమోదు అయి, తొమ్మిది హాట్‌స్పాట్ జిల్లాల పరిధిలోకి చేరింది. తరువాతి క్రమంలో పంజాబ్, జమ్మూ కశ్మీర్, కర్నాటకలో 8 జిల్లాలు హాట్‌స్పాట్లు అయ్యాయి. కేరళలో ఏడు, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానాలలో ఆరు చొప్పున హాట్‌స్పాట్లు గుర్తించారు. అసోం, హిమాచల్ ప్రదేశ్‌లలో ఐదు జిల్లాల చొప్పున హాట్‌స్పాట్లుగా నమోదు అయ్యాయి. బీహార్, పశ్చిమ బెంగాల్‌లు రెడ్‌జోన్ల పరిధిలోకి వచ్చి నాలుగు జిల్లాలు వైరస్‌కు హాట్‌స్పాట్లు అయ్యాయి.

 

170 Districts in Corona Hotspot
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News