Sunday, April 28, 2024

ఐదేళ్ల చిన్నారి అత్యాచారం కేసులో కామంధుడికి 20ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

Minor Girl has been Raped for past three months

 

మనతెలంగాణ/హైదరాబాద్: ఐదేళ్ల చిన్నారిపై ఆఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడికి గురువారం నాడు నాంపల్లి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. శిక్షతోపాటు 10వేల రూపాయల జరిమానా విధించింది. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌కు వలస వచ్చిన నిందితుడు సుక్రీత్ సింగ్ లారీ లోడింగ్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు.గత అక్టోబర్‌లో తాను అద్దెకు ఉంటున్న ఇంటి సమీపంలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసి ఆధారాలు కోర్టుకు సమర్పించారు. విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News