Sunday, April 28, 2024

పదవులను ఎడమ కాలితో తన్ని… అదే ముఖ్యమన్నారు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

రాజన్నసిరిసిల్ల: తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కొందరు కెసిఆర్ ను అపహాస్యం చేశారని మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు. రాజన్నసిరిసిల్లలో మంత్రి కెటిఆర్ పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టిఆర్ఎస్ పార్టీ స్థాపించి గులాబీ జెండాలు గ్రామాల్లోకి తీసుకెళ్తే సిఎం కెసిఆర్ హేళన చేశారని, గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. ఏప్రిల్ 25 నాటికి టిఆర్ఎస్ పార్టీ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నందకు గర్వంగా ఉందని కెటిఆర్ పేర్కొన్నారు. రెండు దశాబ్దాలు పాటు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, నిలదొక్కుకొని టిఆర్ఎస్ పార్టీని కెసిఆర్ ముందుకు నడిపిస్తున్నారని చెప్పారు. తెలంగాణ కోసం గతంలో చేసిన బలిదానాలు, పోరాటాలు వృధా కాకూడదని టిఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణను కెసిఆర్ తీసుకొచ్చారని గర్వంగా కెటిఆర్ చెప్పారు.

దివంగత నేత జయశంకర్ సార్ లాంటి మేధావుల సహకారంతో ఉద్యమాన్ని నడిపించి, రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత కెసిఆర్ కే దక్కుతుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు  పదవులును ఎడమ కాలితో తన్ని తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాళ్లతో కొట్టి చంపండని సాహోసోపేతంగా కెసిఆర్ ప్రకటించారన్నారు. కెసిఆర్ లేకపోతే ఇవాళ అడ్డగోలుగా మాట్లాడుతున్న బిజెపి, కాంగ్రెస్ నాయకులకు అస్థిత్వమే లేదన్నారు. టిఆర్ఎస్ చరిత్రలో ఎన్నో విజయాలు సాధించిందని, చిన్న చిన్న విజయాలకే ఎగిరెగిరిపడుతున్న బిజెపి నాయకులకు తగిన సమమంలో బుద్ధి చెబుతామని కెటిఆర్ హెచ్చరికలు జారీ చేశారు. సహనాన్ని అసమర్థతగా భావిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ వచ్చినంక అన్ని రంగాల్లో తెలంగాణను ముందుకు నడిపిస్తున్న గొప్ప నేత కెసిఆర్ అని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News