Sunday, April 28, 2024

వాళ్లకు నిధులు తీసుకరావడం చేతకాదు: బాల్కసుమన్

- Advertisement -
- Advertisement -

Balka Suman comments on BJP leaders

 

హైదరాబాద్: బిజెపి ఎంపిలకు తెలంగాణకు నిధులు తీసుకరావడం చేతకాదని ఎంఎల్ఎ బాల్కసుమన్ మండిపడ్డారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి పార్లమెంట్ సాక్షిగా ఐటిఐఆర్ పై అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. బిజెపి నేతల తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకరావడంలో బిజెపి విఫలమైందని, అందుకు కెసిఆర్ ప్రభుత్వం బిజెపి నాయకులు విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ఉన్న  ప్రాజెక్ట్ లలో ఒక్కదానికి జాతీయ హోదా తీసుకరావాలని బిజెపి నేతలకు సుమన్ సూచించారు. కేంద్ర రైల్వే బడ్జెట్ లో తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులకు వన్ రూపాయి కేటాయించారని ఎద్దేవా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News