Friday, May 10, 2024

జి20 సదస్సు… ప్రపంచ నేతలకు ‘అవతార్ ’ స్వాగతం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అత్యంత ప్రతిష్టాత్మక జి20 సదస్సు ఢిల్లీ వేదికగా ఈనెల 9,10 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ సదస్సులో భారత్ ప్రజాస్వామ్య మాతృక ( మదర్ ఆఫ్ డెమొక్రసీ ) పేరుతో ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను సందర్శించడానికి వచ్చే దేశాధినేతలకు ఆహ్వానించడానికి కృత్రిమ మేథ ఆధారిత ప్రత్యేక ‘అవతార్’ ను ఏర్పాటు చేశారు.

వేదకాలం నుంచి ఆధునిక యుగం వరకు దేశ ప్రజాస్వామ్య సంస్కృతులను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్నారు. ఇంగ్లీష్, ఫ్రెంచ్ మాండరీన్, ఇటాలియన్, కొరియన్, జపనీస్ తదితర 16 ప్రపంచ భాషల్లో ఆడియోను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించడానికి ప్రపంచ దేశాల అగ్రనేతలు , ఇతర ప్రతినిధులు రాగానే వారికి “అవతార్‌” స్వాగతం పలుకుతుంది. ఎగ్జిబిషన్ ప్రాముఖ్యత గురించి అతిథులకు అవతార్ వివరిస్తుంది. ఇలాగే భారత్ ప్రజాస్వామ్య చరిత్రను చాటిచెప్పే అనేక కియోస్క్‌ల ద్వారా 26 ఇంటరాక్టివ్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

ఎగ్జిబిషన్ ప్రాంగణం సెంట్రల్ హాల్‌లో హరప్పాబాలిక ప్రతిరూపాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవంగా ఈ హరప్పా బాలిక శిల్పం ఎత్తు 10.5 సెంటీమీటర్లు కాగా, ఈ ఎగ్జిబిషన్‌లో 5 అడుగుల ఎత్తు, 120 కిలోల బరువున్న కాంస్య శిల్పాన్ని ప్రదర్శించనున్నారు. ఇది పోడియంపై గుండ్రంగా తిరుగుతూ కనిపిస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇక దేశ ఎన్నికల చరిత్రకు సంబంధించి 195152 లో తొలిసార్వత్రిక ఎన్నికల నుంచి 2019 లోక్‌సభ ఎన్నికల వరకు ఎన్నికల విధానాల్లో వచ్చిన మార్పులను ఈ ఎగ్జిబిషన్‌లో చూపించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News