Tuesday, May 21, 2024

కల్లలైన అమెరికా కల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన పలువురు భారతీయ విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. 21 మంది విద్యార్థులను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరిగి భారత్‌కు తిరిగి పంపారు. అమెరికాలోని పలు యూనివర్సిటీల్లో ఉన్నత చదువుల కోసం విద్యార్థులు వెళ్లితే సరైన పత్రాలు లేవంటూ అనుమతి నిరాకరించారు. వీసా ప్రక్రియలను పూర్తి చేసినప్పటికీ ఆయా విశ్వవిద్యాలయాల నుంచి అడ్మిషన్లు పొందినా కూడా మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేసిన మూడు గంటల పాటు విమానశ్రయంలో నిర్భందించి ఇబ్బందులకు గురిచేశారు. విద్యార్థుల అవస్ధలతో అధికారులు తిరిగి వారిని స్వదేశానికి పంపారు. శాన్‌ఫ్రాన్సిస్కో, షికాగో, అట్లాంటా విమానశ్రయాల్లో ఈ పరిస్థితులు విద్యార్థులు ఎదుర్కొన్నారు.

భారతీయ విద్యార్థులను తిరిగి ఎయిర్ ఇండియా విమానంలో భారత్‌కు పంపారు. ఆయా విద్యార్థులు అమెరికాలో ప్రవేశించకుండా ఐదేళ్లపాటు పాటు నిషేధం విధించారు. సరైన ధృవీకరణ లేకపోవడంతోనే విద్యార్థులను తిప్పిపంపినట్లుగా తెలుస్తుంది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు సమాచారం, ఈసమస్యతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తమ పిల్లలు ఉన్నత చదువులకు వెళ్లేందుకు అమెరికా అంబాసిడర్‌తో మాట్లాడి చదువులు కొనసాగేలా చూడాలని వేడుకుంటున్నారు. తమ పిల్లల కోసం రూ. 20 లక్షల వరకు ఖర్చుచేసినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News