Tuesday, April 30, 2024

కరోనా చికిత్స… రూ.24 లక్షల బిల్లు

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: కరోనా చికిత్సలో కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు వైద్య ఖర్చులకు వేసే బిల్లులు చూసి షాక్ తింటున్నారు. ఆ బిల్లును చూసి కరోనా రోగులకు గుండెపోటు వస్తుంది. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కరోనా సోకడంతో నాగోల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. 29 రోజులు ఆస్పత్రిలో ఉండడంతో 24 లక్షల రూపాయల బిల్లు వేశారు. బిల్లు చూసి బాధితుడు, కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐసియుకు రూ.9 వేలు, ఆక్సిజన్ బెడ్‌కు రూ.7వేలు, జనరల్ వార్డుకు రూ.4 వేలు తీసుకోవాలని తెలిపింది. ప్రైవేటు ఆస్పత్రులు ఇవేమీ పట్టించుకోకుండా కరోనా రోగులతో దందా కొనసాగిస్తున్నాయి. వెంటనే బాధితుడు వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News