Saturday, May 4, 2024

శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ (శంషాబాద్): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ వద్ద సోమవారం సాయంత్రం ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొన్న ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పెద్ద అంబర్ పేట వైపునుండి శంషాబాద్ వైపు వెళుతున్న హుందాయ్ క్రేటా ఎంహెచ్ 21బివి 0247 కారులో ప్రయాణిస్తున్న అనంద్ నాల్దీవు, సంపత్ కాశీనాడు, రంగనాథ్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఉన్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని శంషాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతులు మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. ఈక్రమంలో పోలీసులు, ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది కారులో ఇరుక్కుపోయిన మూడు మృతదేహాలను వెలికితీశారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసిన శంషాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా కారులో ఔరంగాబాద్‌కు చెందిన ఐదుగురు హయత్‌నగర్ నుంచి శంషాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది.
మృతులు ఔరంగాబాద్ వాసులు ః
ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు మృతులు మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో కారు పూర్తిగా కంటేనర్ కిందికి దూసుకెళ్ళి నుజ్జు నుజ్జు అయింది. కారులో చిక్కుకున్న ముగ్గురిని రక్షించేందుకు పోలీసులు యత్నించగా ఫలితం లేకుండా పోయింది.ఈ ఘటనలో గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
తిరుపతికి వెళ్లి వస్తూ ః
మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ఐదుగురు కారులో తిరుపతి వెళ్ళి తిరిగి స్తుండగా ప్రమాదం జరిగిందని, సంఘటనా స్థలాన్ని పరిశీలించిన శంషాబాద్ డిసిసి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలను సమీక్షిస్తున్నామని, మద్యం సేవించి వాహనం నడపడంతో ప్రమాదం జరిగిందా? ఓవర్ స్పీడ్ తో జరిగిందా? అనే కోణంలో వివరాలను సేకరిస్తున్నామన్నారు.

3 Killed in Road Accident in Shamshabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News