Tuesday, May 14, 2024

నలుగురు సిబిఐ అధికారులు డిస్మస్

- Advertisement -
- Advertisement -

 

CBI arrests, dismisses 4 officers for illegal raid on Chandigarh firm

న్యూఢిల్లీ : అవినీతికి పాల్పడిన నలుగురు కేంద్ర నేర పరిశోధక శాఖ(సిబిఐ)  అధికారులపై వేటుపడింది. నలుగురు సబ్-ఇన్‌స్పెక్టర్లను డిస్మిస్ చేసినట్టు సిిబిఐ వర్గాలు వెల్లడించాయి. వీరంతా నగదు దోపిడీ కోసం చండీగఢ్‌లోని ఓ కంపెనీపై నకిలీ సోదాలు చేశారని తేలింది. అవినీతి కేసులో వీరంతా అరెస్ట్ అవ్వడంతో ఈ చర్య తీసుకున్నట్టు సిబిఐ వర్గాలు వెల్లడించాయి. అవినీతి నిరోధక విధానానికి అనుగుణంగా సిబిఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. నలుగురు అధికారుల వ్యవహారం తన దృష్టికి వచ్చిన వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కాగా డిస్మిస్‌కు గురయిన అధికారుల పేర్లు సుమిత్ గుప్తా, ప్రదీప్ రాణా, అంకున్ కుమార్, ఆకాశ్ అల్హావత్‌గా వెల్లడించారు. వీరంతా సిబిఐ ఢిల్లీ యూనిట్లలో పని చేస్తున్నారు. నకిలీ సోదాలకు సంబంధించిన కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఈ వేటు పడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News