Tuesday, April 30, 2024

రాష్ట్రంలో కొత్తగా 42 కేసులు

- Advertisement -
- Advertisement -

42 new Corona cases registered

 

21 మంది డిశ్చార్జ్
1551కి చేరిన పాజిటివ్‌లు
క్వారంటైన్‌లో 12 మంది పురానాపూల్ ఎస్‌బిఐ సిబ్బంది
బ్యాంకుకు వచ్చిన మహిళకు వైరస్, మాదన్నపేట, జియాగూడలో అప్రమత్తత

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. వైరస్ బారిన పడే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. అయితే ఇప్పటి వరకు బస్తీలు, కాలనీలను అతలాకుతలం చేయగా, తాజాగా బ్యాంక్‌లోనూ కరోనా సెగ తాకింది. కేవలం ఒక్కరికి పాజిటివ్ తేలగా, అధికారులు 12 మందిని క్వారంటైన్ చేశారు. నగరంలోని పురానాపూల్ ఎస్‌బిఐ బ్యాంక్‌కు వచ్చిన ఓ మహిళకు కరోనా నిర్ధారణ కాగా, ఆ బ్యాంక్‌లో మొత్తం 12 మంది సిబ్బందిని క్వారంటైన్ చేసినట్లు జిల్లా వైద్యాధికారులు పేర్కొన్నారు. ఇటీవల బ్యాంక్‌లో లావాదేవీలు జరిపేందుకు ఓ మహిళ ఎస్‌బిఐ బ్యాంక్‌కు వెళ్లింది. అయితే రెండు రోజుల క్రితం అనుమానిత లక్షణాలు ఉండటంతో టెస్టులు చేయగా పాజిటివ్ తేలినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ మహిళ కంటైన్‌మెంట్ జోన్ నుంచి బ్యాంక్‌కు వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో బ్యాంక్ సిబ్బందిని క్వారంటైన్ చేసి శాంపిల్స్ తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.

అయితే కొత్తగా బ్యాంక్‌ల నుంచి కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బ్యాంక్ సేవలను కూడా నిలిపివేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు రాజధానిలో వనస్థలిపురం, జియాగూడ, పాతబస్తీ , మలక్‌పేట్ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కొత్తగా 42 మందికి కరోనా సోకగా, 21 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీనిలో జిహెచ్‌ఎంసి పరిధిలో 37 మందికి, రంగారెడ్డి నుంచి ఇద్దరితో పాటు మరో ముగ్గురు వలస కార్మికులకూ కరోనా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1551కు చేరగా, డిశ్చార్జ్‌ల సంఖ్య 992కు చేరింది. ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుప్రతుల్లో 525 చికిత్స పొందుతున్నారని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. వైరస్ దాడిలో ఇప్పటి వరకు 34 మంది మరణించారని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా సోకిన వలస కార్మికుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఆదివారం వరకు మొత్తం 57 మంది మైగ్రెంట్స్‌కు వైరస్ సోకిందని అధికారులు పేర్కొన్నారు.

మదన్నపేట్‌లో మరో ఇద్దరికి వైరస్…

మాదన్నపేట్‌లో మరో ఇద్దరికి కరోనా వ్యాపించింది. దీంతో మాదన్నపేట్ లో ఒకే అపార్ట్‌మెంట్‌లో కరోనా కేసుల సంఖ్య 30కి చేరింది. ఇదిలా ఉండగా ముసారాంబాగ్ తీగలగూడలో ఒకే ఇంట్లో నలుగురికి పాజిటివ్ నిర్థారణ అయినట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఓల్డ్ మలక్‌పేట్ వాహేద్‌నగర్‌లో కూడా మరో వ్యక్తికి కూడా పాజిటివ్ వచ్చింది. మరోవైపు కరోనా నుంచి కోలుకొని ఇళ్లకు చేరుతున్న వారికి స్థానికులు పూలవర్షంతో స్వాగతం పలుకుతున్నారు. ఆదివారం ఎల్‌బినగర్ పరిధిలో ఓ కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా వైరస్‌ను జయించి ఇళ్లకు చేరే సమయంలో ఆ కాలనీ వాసులు వీరికి పూలవర్షంతో స్వాగతం పలికారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే సుదీర్‌రెడ్డి వీరికి చికిత్సను అందించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో 22842 మందికి టెస్టులు నిర్వహణ……

రాష్ట్రంలో ఆదివారం వరకు 22842 మందికి కరోనా టెస్టులు చేశామని అధికారులు వెల్లడించారు. దీనిలో 6 శాతంతో 947 మంది పురుషులకు పాజిటివ్ రాగా, 7 శాతంతో 566 స్త్రీలకు వైరస్ సోకింది. అదే విధంగా టెస్టుల చేసిన వారిలో 94 శాతంతో 14256 మంది మగవాళ్లకు నెగటివ్ రాగా, 93 శాతంతో 7619 స్త్రీలకు వైరస్ సోకిందని బులిటెన్‌లో పేర్కొన్నారు. అదే విధంగా వయస్సు వారిగా గమనిస్తే 0 నుంచి 15 వయస్సు వారిలో 97 మంది పురుషులకు, 121 స్త్రీలు, 16 నుంచి 30 వయస్సు వారిలో 182 మంది పురుషులకు, 252 మంది స్త్రీలకు, 31 నుంచి 45 మధ్యవారిలో 148 మంది పురుషులకు, 258 స్త్రీలు, 46 నుంచి 60 మధ్యవయస్సు వారిలో 93 మంది పురుషులు, 208 మంది స్త్రీలు, 60 నుంచి పై బడిన వారిలో 45 మంది పురుషులకు, 106 మంది స్త్రీలకు వైరస్ సోకినట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్ పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News