Sunday, April 28, 2024

హెల్మెట్ ధరించకుంటే ‘ప్రాణాలు హరి’

- Advertisement -
- Advertisement -

450 people killed road accidents in last year

పిలియన్ రైడర్ హెల్మెట్‌పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి
గత ఏడాది 450 మంది మృతి
ఈ ఏడాది పిలియన్ రైడర్లపై 2,36,027కేసులు

హైదరాబాద్:  మోటార్ సైకిల్ వెనుకు కూర్చునే వారు హెల్మెట్ ధరించడంపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ మధ్య జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడంతో వెనుక కూర్చున్న వారు మృతి చెందుతున్నారు. దీంతో వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పేట్‌బషీరాబాద్, బాచుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ఇద్దరు మహిళలు హెల్మెట్ ధరించకపోవడంతో భారీ వాహనాలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

వాహనాలు నడుపుతున్న వారు హెల్మెట్ పెట్టుకోవడంతో స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఇందులో ఇంజనీరింగ్ చేస్తున్న యువతి కూడా మృతి చెందింది. వెనుక కూర్చున్న వారు మృతిచెందడంతో పోలీసులు తనిఖీలు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నారు, జరిమానాలు విధిస్తున్నారు. అంతే కాకుండా ప్రామాణికమైన హెల్మెట్లు వాడాలని సూచిస్తున్నారు. ఆఫ్ హెల్మెట్లు, నిర్మాణ రంగంలో వాడే హెల్మెట్లను అంగీకరించమని వాటిని హెల్మెట్లుగా పరిగణించమని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీనికి అనుగుణంగా గతంలో నాసిరకమైన హెల్మెట్లపై సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి ఎస్‌ఎం విజయ్‌కుమార్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హాఫ్ హెల్మెట్లు, నాసిరకమైన హెల్మెట్లు పెట్టుకుని వాహనాలపై వచ్చిన వారిని ఆపి వాటిని ధ్వంసం చేశారు. కొందరు వాహనదారులకు నాన్ కాంటాక్ట్ పద్ధ్ధతిలో జరిమానా విధించారు. నాసిరకమైన హెల్మెట్లు పెట్టుకున్న వారిని ఆపి వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు.

భారీగా కేసులు నమోదు…

బైక్ వెనుక కూర్చున్న వారు హెల్మెట్ పెట్టుకోకపోవడంతో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు 2,36,027 కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యక్షంగా, నాన్ కాంటాక్ట్ పద్ధతిలో కేసులు నమోదు చేశారు. బైక్ వెనుక కూర్చునే వారు నాలుగు సంవత్సరాలు దాటితే హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మోటార్ వాహనాల చట్టం 129 ప్రకారం తప్పనిసరిగా బైక్‌పై ప్రయాణిస్తున్న వారు హెల్మెట్ ధరింలని దీనిని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు.

వాహనదారుల భద్రత కోసమే: సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్

హెల్మెట్ నిబంధనలను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కఠినంగా అమలు చేయనున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. బైక్ వెనుక కూర్చున్న వారు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా చనిపోతున్నారు, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే మృతిచెందారని అన్నారు. బైక్‌పై ప్రయాణిస్తున్న వారి భద్రత కోసమే హెల్మెట్ నిబంధనలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు, జరిమానాలు విధిస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News