Monday, April 29, 2024

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః కొత్త సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. వేడుకల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనరేట్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు సురక్షితంగా వేడుకలు జరుపుకోవాలని, పబ్లిక్ ఏరియాలో వేడుకలు చేసుకునే వారు నిబంధనలు అతిక్రమించవద్దని అన్నారు.

రాత్రి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వస్తాయని తెలిపారు. ఫ్లైఓవర్లు, ఓఆర్‌ఆర్ రోడ్డు మూసివేస్తామని తెలిపారు. ఎర్‌పోర్టు వెళ్లే వారు టికెట్ చూపించి ఓఆర్‌ఆర్‌లో ప్రయాణించవచ్చని తెలిపారు. కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తెల్లవారే వరకు ఉంటాయని తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్లిక్‌గా జరిపే ప్రతి ఈవెంట్‌కు పోలీసుల అనుమతి తప్పనిసరని, సన్‌బర్న్ ఈవెంట్‌కు ఈసారి అనుమతి లేదని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News