Wednesday, May 15, 2024

నెట్ బ్యాంకింగ్.. 5 జాగ్రత్తలు

- Advertisement -
- Advertisement -

5 Tips for Safe Internet Banking

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక నేరాల సంఖ్య పెరుగుతోంది. పిషింగ్, నెట్ బ్యాంక్ హ్యాకింగ్, ఎటిఎం క్లోనింగ్ వంటి ఇతర నేరపూరిత లావాదేవీలు రోజూ వార్తల్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఈ రోజుల్లో నగదును మరొకరికి పంపాలంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అత్యంత వేగవంత, సౌకర్యవంతమైనదిగా ఉంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే దీని వల్ల ప్రమాదం కూడా పొంచి ఉందని నిపుణులు పేర్కొన్నారు.

పాస్‌వర్డ్

మీ పాస్‌వర్డ్‌ను తరచూ మారుస్తూ ఉండాలి. ఆ వివరాలను ఎక్కడ కూడా రాయడం గానీ, షేర్ చేసుకోవడం గానీ చేయకూడదు. మరో జాగ్రత్త వహించాల్సిన విషయం ఏమిటంటే.. మీ ఐడి, పాస్‌వర్డ్ గుర్తుంచుకునేందుకు బ్రౌజర్‌కు అనుమతి ఇవ్వొద్దు, అది మీ పర్సనల్ కంప్యూటర్ అయినా కూడా.. ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వొద్దు.

పబ్లిక్ కంప్యూటర్

సైబర్ కేఫ్‌లు లేదా, ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో కంప్యూటర్ ద్వారా నెట్‌బ్యాంకింగ్ సౌకర్యాన్ని వినియోగించుకోరాదు. పబ్లిక్ ప్రాంతాల్లో వైఫై వంటి సౌకర్యాలను వినియోగించుకోకుండా ఉండడమే మంచిది. తప్పని పరిస్థితుల్లో పబ్లిక్ కంప్యూటర్‌ను వినియోగించాల్సి వస్తే.. మీ తాత్కాలిక ఫైల్స్, బ్రౌజింగ్ హిస్టరీని అన్నింటిని డెలీట్ చేయాలి.

మీ వివరాలను షేర్ చేసుకోవడం

ఫోన్ లేదా ఇమెయిల్ ద్వారా మీ రహస్య సమాచారాన్ని కోరబోమని.. బ్యాంకులు తరచూ ఇదే విషయాన్ని చెబుతున్నాయి. వినియోగదారులు తమ బ్యాంకింగ్ సమాచారం అంటే లాగిన్ ఐడి, పాస్‌వర్డ్, కార్డ్ గ్రిడ్ నంబర్, సివిపిఇ నంబర్ వంటి ఎవరితోనూ పంచుకోవద్దు.

సురక్షిత వెబ్‌సైట్

బ్యాంక్ లావాదేవీలు నిర్వహించేటప్పుడు సురక్షిత వెబ్‌సైట్ ఉందా? లేదా? చెక్ చేసుకోవాలి. బ్రౌజింగ్‌లో అడ్రస్ బార్‌లో బ్యాంక్ యుఆర్‌ఎల్‌ను చూసుకోవాలి. మీ సెర్చ్ ఇంజిన్, ఇమెయిల్‌లపై యుఆర్‌ఎల్ లింక్‌లు ట్రాప్ చేయకుండా జాగ్రత్త వహించాలి. వీటి ద్వారా కూడా మోసగాళ్లు మీ సమాచారాన్ని దొంగిలిస్తారు.

లావాదేవీ వివరాలను చెక్ చేసుకోవాలి

లావాదేవీలు నిర్వహించిన తర్వాత ఎల్లప్పుడు మీ ట్రాన్‌సాక్షన్ హిస్టరీ, ఇతర వివరాలను చెక్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇప్పుడు ప్రతి బ్యాంక్ ఎప్పటికప్పుడు మీ జరిపిన లావాదేవీల వివరాలను.. ఎస్‌ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా వెంటనే పంపిస్తున్నాయి. ఒక అలాంటి లావాదేవీలు మీరు నిర్వహించలేదని గుర్తించినట్లయితే వెంటనే బ్యాంక్‌కు సమాచారం అందివ్వాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News