Sunday, April 28, 2024

దేశంలో 3 కోట్లు దాటిన కరోనా పరీక్షలు

- Advertisement -
- Advertisement -

దేశంలో 3 కోట్లు దాటిన కరోనా నిర్ధారణ పరీక్షలు
ఒక్కరోజే 7.31 లక్షల శాంపిళ్లకు టెస్టింగ్‌లు
దేశవ్యాప్తంగా 1470 టెస్టింగ్ ల్యాబ్‌లు

57981 New Corona Cases Registered in India

న్యూఢిల్లీ: దేశంలో కరోన వైరస్ నిర్ధారణ పరీక్షలు 3 కోట్లు దాటాయి. ఆగస్టు 16వ తేదీ వరకు దేశంలో మొత్తం 3,00,041, 400 శాంపిళ్లకు కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగాయని, ఆదివారం ఒక్కరోజే 7,31,697 శాంపిళ్లకు పరీక్షలు జరిగాయని ఐసిఎంఆర్ గణాంకాలు పేర్కొన్నాయి. సకాలంలో, ఉధృతంగా పరీక్షలు నిర్వహించడంపై దృష్టి పెట్టడం వల్ల దేశంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు 3 కోట్లు దాటాయని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ ట్వీట్ చేసింది. జులై 6వ తేదీ నాటికి దేశంలో కరనా నిర్ధారణ పరీక్షలు 1 కోటి దాటగా ఆగస్టు 2వ తేదీకి అవి 2 కోట్లు దాటాయి. లాక్‌డౌన్ మొదలైనప్పుడు పుణెలోని జాతీయ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్(ఎన్‌ఐవి)లో మాత్రమే కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగాయి. లాక్‌డౌన్ మొదలైన తొలి నాళ్లలోనే ల్యాబ్‌ల సంఖ్య వందకు పెరిగింది. జూన్ 23న 1000వ టెస్టింగ్ ల్యాబ్ ఏర్పడినట్లు ఐసిఎంఆర్ తెలిపింది. ప్రస్తుతం దేశంలో మొత్తం 1470 కొవిడ్-19 టెస్టింగ్ ల్యాబ్‌లు ఉండగా అందులో 969 ప్రభుత్వ ల్యాబ్‌లు, 501 ప్రైవేట్ ల్యాబ్‌లు ఉన్నాయి.

57,981 కొత్త కేసులు
దేశంలో కరోనా కేసులు సోమవారానికి 26,47,963కి చేరుకున్నాయి. సోమవారం ఉదయం వరకు గడచిన 24 గంటల్లో దేశంలో 57,981 పాజిటివ్ కేసులు నమోదు కాగా 941 మంది మరణించడంతో మృతుల సంఖ్య 50,000 దాటింది. దేశంలో మొత్తం 19,19,842 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో రికవరీ రేటు 72.51 శాతానికి పెరిగినట్లు ఐసిఎంఆర్ నివేదిక పేర్కొంది. దేశంలో కొవిడ్-19 మరణాల సంఖ్య 1.92 శాతానికి క్షీణించినట్లు తెలిపింది. గడచిన 24 గంటల్లో సంభవించిన 941 కరోనా మరణాలలో మహారాష్ట్రలో అత్యధికంగా 288 చోటుచేసుకున్నాయి. తమిళనాడులో 125, కర్నాటకలో 116, ఆంధ్రప్రదేశ్‌లో 88, ఉత్తర్ ప్రదేశ్‌లో 56, పశ్చిమ బెంగాల్‌లో 51, పంజాబ్‌లో 41, గుజరాత్‌లో 20, జార్ఖండ్‌లో 16, జమ్మూ కశ్మీరులో 15, రాజస్థాన్‌లో 14, బీహార్, మధ్యప్రదేశ్‌లో 11 చొప్పున, కేరళ, ఒడిష, హర్యానా, తెలంగాణలో 10 చొప్పున, ఢిల్లీలో 8, ఛత్తీస్‌గఢ్, అస్సాంలో 7 చొప్పున మరణాలు సంభవించాయి. గోవాలో 6, పుదుచ్చేరి, లడఖ్, అండమాన్ నికోబార్ దీవులు, త్రిపురలో 4 చొప్పున, మణిపూర్‌లో 3, చండీగఢ్, ఉత్తరాఖండ్‌లో 1 చొప్పున మరణాలు చోటుచేసుకున్నాయి.

57981 New Corona Cases Registered in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News