Sunday, May 12, 2024

ధోనీ ఓ అద్భుత క్రికెటర్: షేన్ వార్న్

- Advertisement -
- Advertisement -

Shane Warne praises MS Dhoni after Retirement

సిడ్నీ: ప్రపంచ క్రికెట్‌లోనే మహేంద్ర సింగ్ ధోనీ అద్భుత క్రికెటర్ అని ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం షేన్ వార్న్ ప్రశంసించాడు. అతనిలాంటి క్రికెటర్ దొరకడం చాలా కష్టమన్నాడు. బ్యాట్స్‌మన్‌గా, వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా ధోనీ తన పాత్రను అత్యంత విజయవంతంగా నిర్వర్తించాడన్నాడు. అతను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం తనను బాధకు గురి చేసిందన్నాడు. అయితే ఏ ఆటగాడికైన ఇటువంటి పరిస్థితి తప్పదన్నాడు. ఏదో ఒక రోజు ఆట నుంచి తప్పుకోక తప్పదన్నాడు. ఇక ధోనీ వంద బంతుల క్రికెట్ ఆడితే తాను స్వాగతిస్తానని వార్న్ పేర్కొన్నాడు. ధోనీ కోరితే ఈ టోర్నీ కోసం తానే నిధులను సేకరిస్తానని స్పష్టం చేశాడు. ఇక రానున్న ఐపిఎల్ సీజన్‌లో ధోనీ విశ్వరూపం ప్రదర్శించడం ఖాయమని వార్న్ జోస్యం చెప్పాడు.

Shane Warne praises MS Dhoni after Retirement

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News