Friday, May 10, 2024

అమీన్‌పూర్ నిందితుల రహస్య విచారణ

- Advertisement -
- Advertisement -

అమీన్‌పూర్ నిందితుల రహస్య విచారణ
రెండు రోజుల పోలీస్ కస్టడికి కోర్టు అనుమతి

Police secret investigation in Ameenpur orphanage case

మనతెలంగాణ/హైదరాబాద్: అమీన్‌పూర్ అనాధాశ్రమ బాలిక మృతి కేసులోని నిందితులను రెండు రోజలు పాటు పోలీసు కస్టడికి ఇస్తూ కోర్టు అనుమతినిస్తూ సోమవారం ఆదేశాలిచ్చింది. దీంతో నిందితుల నుంచి కీలక ఆధారాలు సేకరించే నిమిత్తం పోలీసులు రహస్యంగా విచారణ చేపడుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు వేణుగోపాల్ రెడ్డి, నిర్వాహకురాలు విజయ, సంస్థ సభ్యుడు జయదీప్‌లను అమీన్‌పూర్ పోలీసులు సంగారెడ్డి జిల్లా కంది జైలుకు చేరుకుని ముగ్గురిని కస్టడీలోకి తీసుకుని కంది జైలు నుంచి నిందితులను అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించార. ఈక్రమంలో అమీన్‌పూర్ అనాథాశ్రమ బాలిక మృతి కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. కాగా, ఈ కేసును శిశు సంక్షేమశాఖ అధికారులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ విచారణ కొనసాగుతుండగానే, మరోవైపు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అమీన్‌పూర్ ఆశ్రమ ఘటనకు సంబంధించి పోలీసులు రహస్యంగా విచారణ కొనసాగిస్తున్నారు. నిందితులను ఆశ్రమానికి తరలించి పఠాన్ చెరువు డిఎస్‌పి విచారణ చేస్తున్నారు. పోలీస్ కస్టడీ విచారణ విషయాలు బయటకు తెలియకుండా అత్యంత గోప్యంగా విచారణ జరుగుతోంది.

నిందితులను ఆశ్రమంలోనే ఉంచి విచారణ చేయడంతో పాటు ఆశ్రమ పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆశ్రమానికి 200 మీటర్ల దూరం వరకు ఆంక్షలు విధించారు. ఇప్పటికే బాధిత కుటుంబం హైపర్ కమిటీ ముందు హాజరై తమ వాగ్మూలం ఇచ్చింది. ఫోక్సో కేసు పెట్టిన వెంటనే అరెస్ట్ చెయ్యాల్సింది పోయి అధికారులు ఆలస్యం చేశారంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. అమీన్‌పూర్‌లోని మియాపూర్ శివారు ప్రాంతంలోని మారుతి అనాథాశ్రమం బాలిక ఏడాదిపాటు అత్యాచారానికి గురై ఈనెల 12న నిలోఫర్ ఆసుపత్రిలో మృతి చెందింది. నిందితుడు వేణుగోపాల్ బాలికపై అత్యాచారం చేశాడని, అందుకు సహకరించిన అనాథాశ్రమ నిర్వాహకురాలు విజయ, ఆమె సోదరుడు జైపాల్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనాథాశ్రమం రంగారెడ్డి జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్ అయ్యింది. అనాథశ్రమ చిరునామాలను తరుచూ మారుస్తూ విజయ ఆ ఆశ్రమాన్ని నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆశ్రమంపై ఆరోపణలు ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తున్నాయి.
నిందితులకు వైద్యపరీక్షలు: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మారుతి అనాథాశ్రమం బాలిక కేసులో పరీక్షల కోసం నిందితులను పోలీసులు పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. నిర్వాహకులతో పాటు ప్రధాన నిందితుడు వేణుగోపాల్ రెడ్డిని ఇదివరకే కస్టడీలోకి తీసుకున్నారు.నిందితుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు పరీక్షల కోసం తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం నిందితులను విచారించనున్నట్లు అధికారులు వివరించారు.

Police secret investigation in Ameenpur orphanage case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News