Friday, May 3, 2024

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ రహదారి రక్తసిక్తమైంది. కూరలు కొనేందుకు వెళ్లి సంతోషంగా తిరిగి వస్తున్న సమయంలో తాము ప్రయాణిస్తున్న లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టి బోల్తా పడిన ఘటనలో ముగ్గురు దిససరి కూలీలు మృత్యువాత పడ్డారు. మరో 16 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద ఆదివారం ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కారును (టిఎస్ 34 డి 4799) ఢీకొట్టి లారీ (ఎపి 01 యు 1845) బోల్తా పడింది. శంషాబాద్ నుంచి షాబాద్ రోడ్ వెళ్తుండగా నర్కుడా వద్ద ఈ ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. కాగా, ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులను శంషాబాద్ పరిధిలోని వివిధ ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. లారీ కింద ఆరుగురు కార్మికులు చిక్కుకోగా.. వారిని స్థానికుల సాయంతో రక్షించారు. కార్మికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం బీభత్సంగా మారింది. ప్రమాద సమయంలో లారీలో 50 మంది కార్మికులు వరకు ఉన్నారు. వారంతా ఒడిశాకు చెందిన దిససరి కూలీలు అని గుర్తించారు.

వీరంతా రంగారెడ్డి జిల్లా సర్కుడ సమీపంలో ఇటుకబట్టీలలో పనిచేసే వారని గుర్తించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో పోలీసులు, అత్యవసర వైద్య సిబ్బంది సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. మృతులు కృపా సునా(40), గోపాల్ డీప్(45), కలా కుమార్(25)లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఒడిశా జిల్లాలోని బలం గిరి జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తిం చారు. కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్లారు. తమకిష్టమైన కూరగాయలను కొను క్కొన్నారు. సంతోషంగా అక్కడ్నించీ బయ ల్దేరారు. ఇంతలోనే వారు ప్రయాణిస్తున్న లారీ కారును ఢీకొట్టి బోల్తాపడింది. రోడ్డుకు అడ్డంగా లారీ బోల్తా పడ టంతో చాలాసేపు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయమేర్పడింది. దీంతో ఘటనా స్థలానికి జేసీబిని రప్పించి రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీ ని పక్కకు తొల గించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

6 died in Road Accident at Shamshabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News