Sunday, April 28, 2024

బలోచిస్థాన్ చెక్‌పోస్ట్‌పై ఉగ్రదాడి : ఏడుగురు పాక్ సైనికుల మృతి

- Advertisement -
- Advertisement -

7 Pak Soldiers killed in Terror Attack in Balochistan

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో హార్నాయ్ వద్ద ఉన్న చెక్‌పోస్టుపై ఆదివారం ఉగ్రవాదులు దాడి చేసి ఏడుగురు సైనికులను బలిగొన్నారు. ఈ సంఘటనలో మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. దాడి తరువాత పరారైన ఉగ్రవాదులను పట్టుకోడానికి అన్ని మార్గాలను నిర్బంధించామని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. ఉగ్రవాదులను పట్టుకోడానికి ఈ ప్రాంతంలో భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇలాంటి దాడులు పిరికిచర్యలని, బలోచిస్థాన్ శాంతి, పురోగతికి అవి ఆటంకం కాబోవని ఆర్మీ అధికారులు వ్యాఖ్యానించారు. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఈ సంఘటనపై తీవ్ర విచారం వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియచేశారు. ఈ ప్రాంతంలో ఇటీవల కొద్ది రోజులుగా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి. ఐదు రోజుల క్రితం పదిమంది ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. దానికి ప్రతీకారంగా ఇప్పుడీ దాడి జరిగినట్టు భావిస్తున్నారు.

7 Pak Soldiers killed in Terror Attack in Balochistan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News