Saturday, May 4, 2024

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ఒక అద్భుతం: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రతి రోజూ విభిన్న కార్యక్రమాలతో స్వాతంత్ర్య ప్రత్యేకతను చాటుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.  స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన, వెలకట్టలేని త్యాగాలు చేసిన వారిని స్మరించుకుంటున్నామని,  వనపర్తిలో 3 వేల అడుగుల జాతీయ పతాకం ప్రదర్శన ఒక ప్రత్యేకత చాటుకుందని,  అంబేద్కర్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు 3 కిలోమీటర్ల మేర వేలాది మంది జాతీయ జెండాను చేతులపై ఎత్తుకుని జాతీయ గీతాలాపన చేయడం బహుశా రాష్ట్రంలో మొదటిసారి అని ప్రశంసించారు. అత్యంత వినూత్న, అరుదైన కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్ర్యం విలువ ప్రస్తుత తరాలకు తెలిస్తే భవిష్యత్ తరాలకు అర్థమవుతుందని, అందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ 2 వారాల పాటు భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ సంబరాలకు రూపకల్పన చేశారన్నారు.

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల నేపథ్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో సామూహిక జాతీయ గీతాలాపన సంధర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  స్వయంగా తయారు చేయించిన తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద 3 వేల అడుగుల పొడవైన జాతీయజెండాను ప్రదర్శనగా చేపట్టారు.  15 వేల మంది విద్యార్థులు, యువత, ప్రజలు జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. వనపర్తి అంబేద్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ప్రత్యేక వాహనంలో ప్రయాణించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీసులు, వైద్య ఆరోగ్య, విద్యా తదితర ప్రభుత్వ శాఖలు,  పాఠశాలల యాజమాన్యాలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

 

 

.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News