Tuesday, April 30, 2024

లాక్‌డౌన్ లేకుంటే 8.2 లక్షల కేసులు

- Advertisement -
- Advertisement -

 lockdown

 

పటిష్ట చర్యలతో గణనీయంగా తగ్గిన కేసులు : కేంద్రం

భయపెడుతున్న మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ

24 గంటల్లో దేశంలో 1024 కొత్త కేసులు, మరణాలు 40

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించకపోతే ఏప్రిల్ 15నాటికి భారతదేశంలో 8.2 లక్షల కోవి డ్19 పాజిటివ్ కేసులుండేవని కేంద్ర ఆరోగ్య మ ంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. రోజువారీ మీడి యా సమావేశంలో శనివారం ఆరోగ్యశాఖ సం యుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ దేశ ంలో కరోనా వ్యాప్తి బాగా తగ్గిందన్నారు. ‘కోవిడ్ 19పై పోరాటానికి లాక్‌డౌన్, వ్యాధి వ్యాప్తి నిరోధక చర్యలు చాలా అవసరం. ఒకవేళ ఏ చర్యలూ తీసుకోకుంటే, లాక్‌డౌన్ లేకుంటే ఇప్పటికి దేశవ్యాప్తంగా 8.2 లక్షల కోవిడ్ కేసులుండేవి.

లాక్‌డౌన్‌కు ముందు కేసుల వృద్ధిరేటు 28.9 శాతం ఉం ది. ఆ తర్వాత అది గణనీయంగా తగ్గింది’ అన్నా రు. అందుబాటులో ఉన్న ఆరోగ్య వ్యవస్థ గురించి చెబుతూ అగర్వాల్ కోవిడ్ 19 రోగులకోసం దేశవ్యాప్తంగా లక్ష ఐసోలేషన్ పడకలు, 11,500 ఐసియు బెడ్‌లు సిద్ధం చేశాం’ అన్నారు. కోవిడ్ 19 మహమ్మారిపై ప్రభుత్వం చురుగ్గా స్పందించిందని లవ్ అగర్వాల్ చెప్పారు. అలాగే ప్రత్యేకంగా కోవిడ్ కోసం 586 ఆస్పత్రుల్ని కూడా ఏర్పాటుచేశామన్నారు. ఇలా ఉండగా, దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య 7,447కు చేరుకుంది. వారిలో 642 మందికి చికిత్స చేసి ఆస్పత్రుల నుంచి డిశ్చా ర్జి చేశామని, 239 మంది ఈ వ్యాధి వల్ల మరణించారని తెలిపారు.

మహారాష్ట్రలో..
శనివారం నాడు రాష్ట్రంలో కొత్తగా 92 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 1,666కు పెరిగింది. ఒక్క ముంబయిలోనే 72 నమోదయ్యాయి. కాగా, ఈ వైరస్ వల్ల దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కన్నా మహారాష్ట్రలో ఎక్కువ మంది మరణించారు. రాష్ట్రంలో ఇంతవరకు 110 మంది మరణించగా, 188 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. గత 24 గంటల్లో 13 మంది మరణించారు.

ఢిల్లీలో..
మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత దేశ రాజధానిలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. నిజాముద్దీన్ సంఘటన తర్వాత ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. 13 ప్రార్థనా మందిరాల్లో ఉన్న 102 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని పరీక్షలు జరపగా 52 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. వారిలో ముగ్గురు మరణించారని తాజా సమాచారం. కాగా ఢిల్లీలో ఒకే రోజు 200 కరోనా కేసులు నమోదయ్యాయి. రాజధానిలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న 30 హాట్ స్పాట్‌లను గుర్తించి సీజ్ చేశారు. ఢిల్లీలో మొత్తం కరోనా మరణాలు 13.

ఇతర రాష్ట్రాల్లో మరణాలు..
మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో చనిపోతున్నవారి సంఖ్య పెరుగుతోంది. మధ్యప్రదేశ్‌లో 33మంది, గుజరాత్‌లో 19 మంది, పంజాబ్‌లో 11 మంది మరణించారు. తమిళనాడులో ఎనిమిది మంది, కర్ణాటకలో ఆరుగురు, ఆంధ్రప్రదేశ్‌లో ఆరుగురు, పశ్చిమ బెంగాల్‌లో ఐదుగురు, జమ్మూకశ్మీర్‌లో నలుగురు, ఉత్తరప్రదేశ్‌లో నలుగురు, హరియానాలో ముగ్గురు, రాజస్థాన్‌లో ముగ్గురు, కేరళలో ఇద్దరు చనిపోయారు. అసోం, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ లలో ఒక్కొక్కరు మరణించారు.

కోవిడ్ 19 కేసుల వివరాలు

మొత్తం కేసులు : 7,447, కోలుకున్న వారు : 642, మృతులు : 239, గత 24 గంటల్లో కొత్త కేసులు: 1,035, తాజా మరణాలు :40

జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగానికి బ్రేక్..
లాక్‌డౌన్, కరోనా సంబంధిత పరిణామాలపై జాతి నుద్ధేశించి ప్రధాని టీవీల ద్వారా చేయాల్సిన ప్రసంగం రద్దు అయింది. లాక్‌డౌన్ పొడిగింపు గురించిఈ సందర్భంగా ఆయన ప్రకటిస్తారని భావించారు. అయితే ఈ కార్యక్రమం లేదని అధికార వర్గాల సమాచారం ప్రాతిపదికన వార్తా సంస్థలు తెలిపాయి. కొన్ని మినహాయింపులతో, కొన్ని ప్రాంతాలలో లాక్‌డౌన్ కొనసాగింపు గురించి ప్రధాని టీవీ ప్రసంగాలలో చెపుతారని ముందుగా భావించారు. అయితే పూర్తి స్థాయిలోనే లాక్‌డౌన్ కనీసం ఈ నెల చివరి వరకూ ఉండాలని, మినహాయింపులు ఉంటే లాక్‌డౌన్‌తో ఫలితం ఉండదని పలువురు సిఎంలు తెలియచేయడంతో ప్రధాని ప్రస్తుత ప్రసంగం నిలిచిపోయినట్లు, ఆదివారం లేదా సోమవారం దీనిపై సందేశం వెలువరిస్తారని వెల్లడైంది.

 

8.2 lakh cases if there is no lockdown
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News