Tuesday, May 7, 2024

రియాక్టర్ పేలుడు

- Advertisement -
- Advertisement -

రియాక్టర్ పేలుడు.. 8 మందికి గాయాలు
బొల్లారం పారిశ్రామిక వాడ వింధ్య ఆర్గానిక్స్‌లో ప్రమాదం
మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది, సంఘటన స్థలానికి చేరుకున్న ఎన్‌డిఆర్‌ఎఫ్
యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం: ఎంఎల్‌ఎ

8 Injured after Fire Accident in Bollaram

మన తెలంగాణ/ అమీన్‌పూర్: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని బొల్లారం పారిశ్రామిక వాడలో వింధ్య ఆర్గానిక్ పరిశ్రమలో శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రియాక్టర్ పేలి భారీగా మంటలు ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి. ఈ ప్రమాదంలో పరిశ్రమకి చెందిన 8 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో మార్నింగ్ షిఫ్ట్ విధుల్లో 120 మంది కార్మికులు ఉన్నారు. హఠాత్తుగా పేలిన భారీ పేలుళ్ల శబ్దాలతో పరిశ్రమలోని కార్మికులు భయాందోళనతో ఉరుకులు పరుగులు తీశారు. ఒక్కసారిగా పేలిన సాల్వెంట్ పేలుళ్లతో చుట్టుపక్కల పరిశ్రమల కార్మికులు, స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో పరుగులు తీశారు. క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం సమీపంలోని మమత ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ ఇంజన్ సిబ్బంది శ్రమించి ఎగిసిపడుతున్న మంటల ను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం విషయం తెలుసుకున్న ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందం సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రమాద స్థలాన్ని పటాన్‌చెరు ఎంఎల్‌ఎ గూడెం మహిపాల్‌రెడ్డి సందర్శించి మాట్లాడుతూ గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని బాధ్యులైన పరిశ్రమల యాజమన్యాలపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.

8 Injured after Fire Accident in Bollaram

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News