Sunday, May 19, 2024

నైజీరియా హిరాయిన్ రాకెట్ గుట్టు రట్టు .. 8మంది అరెస్టు

- Advertisement -
- Advertisement -

8 of Nigerian Heroin Gang Arrested in Bengaluru

న్యూఢిల్లీ: నైజీరియాకు చెందిన సూత్రధారి మన దేశానికి చెందిన మహిళలను పావులుగా ఉపయోగించుకుని భారీ ఎత్తున హిరాయిన్‌ను రవాణా చేస్తున్న పెద్ద రాకెట్‌ను మాదక ద్రవ్యాల నిరోధక శాఖ అధికారులు శనివారం పట్టుకోగలిగారు. ఈ రాకెట్‌లో విదేశాల నుంచి విమానాల్లో వచ్చిన మహిళలు తమ లగేజీలో హిరాయిన్ దాచిపెట్టి రవాణా చేస్తుంటారు. మన దేశంలోని మహిళలు కూడా ఇందులో పాత్ర వహిస్తున్నారు. రవాణా ఖర్చులన్నీ చెల్లించడమే కాకుండా ప్రతి ట్రిప్పుకు వీరికి నగదు చెల్లింపు జరుగుతుంటుంది. ఈ రాకెట్‌లోని ఎనిమిది మందిని అరెస్టు చేశారు. 35 కిలోల హిరాయిన్‌ను పట్టుకున్నారు. జింబాబ్వే నుంచి బెంగళూరుకు వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికురాళ్లను మొదట ఫెడరల్ యాంటీ డ్రగ్ ఏజెన్సీ అధికారులు పట్టుకుని వారి నుంచి దాదాపు 7కిలోల హిరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

వీరిని ప్రశ్నించడంతో మొత్తం రాకెట్ గూడుపుఠాణీ అంతా బయటపడింది. ఈ నెట్‌వర్క్‌కు సూత్రధాని నైజీరియా జాతీయుడిగా గుర్తించారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్ లోని ఇటార్సి లో కొంతమంది మహిళలే ఉండి ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు తేలింది. ఈ ఆపరేషన్‌లో హై గ్రేడ్ హిరాయిన్ 34.98 కిలోల వరకు పట్టుబడింది. దేశం మొత్తం మీద మేజర్ హీరాయిన్ ట్రాఫింగ్ నెట్‌వర్క్‌గా అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా రూ. 5.8 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.

8 of Nigerian Heroin Gang Arrested in Bengaluru

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News