Tuesday, April 30, 2024

స్వచ్ఛ భారత్ అవార్డుల ప్రదానం

- Advertisement -
- Advertisement -

9 awards for Telangana in Swachh Survekshan

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తెలంగాణకు 9 అవార్డులు,
వివిధ విభాగాల్లో మరి మూడింటిని అందుకున్న రాష్ట్రం, ట్విట్టర్ ద్వారా అభినందించిన మంత్రి కెటిఆర్

అవార్డులు అందుకున్న మున్సిపల్ అధికారులు

మనతెలంగాణ/హైదరాబాద్ : స్వచ్ఛభారత్ మిషన్ అవార్డులను ఢిల్లీలో మున్సిపల్ శాఖ అధికారులు శనివారం అందుకున్నారు. దీని పై మంత్రి కెటిఆర్ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అధికారులను ఆయన అభినందించారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కా ర్యదర్శి అర్వింద్‌కుమార్‌తో పాటు పలువురు అధికారులు ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా తొ మ్మిది అవార్డులను దక్కించుకోగా రాష్ట్రాల కేటగిరిలో, సఫాయి మిత్ర సురక్ష కేటగిరిలో, గార్బెజ్ ఫ్రీ సిటీ రేటింగ్‌లోనూ అవార్డులను రాష్ట్రం దక్కించుకుంది. పట్టణ ప్రగతిలో భా గంగా రాష్ట్ర పట్టణాల్లో చేపట్టిన కార్యక్రమాల కు అవార్డులకు కీలకంగా మారాయి. సఫా యి సురక్ష మిత్ర ఛాలెంజ్ అవార్డును తొలిసారిగా ప్రవేశపెట్టగా, ఈ విభాగంలో రాష్ట్రాల కే టగిరి కింద తెలంగాణను ఎంపిక చేయగా రా ష్ట్రానికి రెండోస్థానం దక్కింది. దేశంలోనే రెం డు రాష్ట్రాలకు మాత్రమే ఈ అవార్డును ప్రకటించారు.

ఇదే విభాగంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రెండో బహుమతిని సాధించింది. మూడు లక్షల జనాభా కంటే తక్కువ ఉన్న విభాగంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంపికయ్యింది. గ్రేటర్ హైదరాబాద్ గార్బెజ్ ఫ్రీసిటీ విభాగంలో ఎంపికయ్యింది. ఈ అవార్డులో ఎంపికైన పట్టణాలకు నగదు బ హుమతిని అందించారు. మొదటి బహుమతి కింద రూ.8 కోట్లు, రెండో బహుమతి కింద రూ.4కోట్లు, మూడో బహుమతి కింద రూ. 2కోట్లను అందించారు. చెత్త రహిత నగరం గా గ్రేటర్ హైదరాబాద్ అ వార్డుకు ఎంపికకా గా, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులో గ్రేటర్ హైదరాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, నిజాంపేట, ఇ బ్రంహీంపట్నం, కొస్గీ, హుస్నాబాద్, ఘట్‌కేస ర్, సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ ప్రాం తాలు ఎంపిక అయ్యాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News