Thursday, May 2, 2024

90 లక్షల బతుకమ్మ చీరలు ఆర్డర్: టెస్కో ఎండి

- Advertisement -
- Advertisement -

 

sarees
హైదరాబాద్: హ్యాండ్లూమ్, పవర్ లూమ్ క్లాత్‌తో మాస్కులు తయారు చేయిస్తున్నామని టెస్కో ఎండి శైలజ రామయ్యర్ తెలిపారు. రెండు లక్షలకు పైగా క్లాత్ మాస్కుల తయారీకి ఆర్డర్లు ఇచ్చామని శైలజ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 100 కంటే ఎక్కువ మాస్కులు ఆర్డర్ చేస్తే డోల్ డెలివరీ చేస్తామని, ఈ ఫోన్ నంబర్ 8143756556కు డయల్ చేసి ఆర్డర్ ఇస్తే డోర్ డెలివరీ చేస్తామన్నారు. సూపర్ మార్కెట్లలోనూ క్లాత్ మాస్కులు అందుబాటులో ఉన్నాయని, 225 రకాలతో 90 లక్షల బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇచ్చామని, ఇప్పటి వరకు బతుకమ్మ చీరల ఉత్పత్తి 40 శాతం పూర్తయిందని, లాక్‌డౌన్ సడలిస్తే అక్టోబర్ వరకు చీరల తయారీ పూర్తవుతుందని శైలజ రామయ్యర్ పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి రూ.80 కోట్ల యూనిఫామ్ ఆర్డర్ టెస్కోకు వచ్చిందని, ప్రభుత్వ వెల్ఫేర్ పాఠశాలల నుంచి రూ.70 కోట్ల ఆర్డర్ వచ్చిందన్నారు. లాక్‌డౌన్ సడలింపు ఉంటే రెండు మూడు నెలల్లో విద్యార్థుల యూనిఫామ్ తయారు చేస్తామని వెల్లడించారు. లాక్‌డౌన్ సడలింపులు ఉంటే చేనేత రంగం పనులు యధావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News