Sunday, May 5, 2024

దేశంలో ఉద్యోగాల వేట తగ్గిపోతోంది!

- Advertisement -
- Advertisement -

workforce
ముంబయి: దేశంలో సరైన ఉద్యోగం లభించక విసిగిపోయి, చాలా మంది ఉద్యోగాల వేటే మానేశారు. ప్రధానంగా మహిళలు చాలా వరకు శ్రామికశక్తి నుంచి తొలగిపోయారు. ముంబయిలోని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ తన తాజా డేటాలో ఈ విషయాన్ని తెలిపింది. దేశంలో ఉద్యోగ కల్పన ఇప్పుడు పెద్ద చిక్కుముడిగా తయారయింది. ఈ నేపథ్యంలో చాలా మంది అసలు ఉద్యోగాల కోసం వెతకడమే మానేశారు. ‘ప్రపంచంలో చాలా వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ మనది, చాలా మంది యువశక్తి ఉన్న దేశం మనది…’ అంటూ చంకలు గుద్దుకున్నా వాస్తవిక పరిస్థితి మరోలా ఉంది. 2017లో 46 శాతంగా ఉన్న శ్రమశక్తి నేడు అంటే 2022 నాటికి 40 శాతానికి పడిపోయింది. మహిళా ఉద్యోగినుల విషయంలోనైతే ఇది మరింత దిగజారింది. దేశ జనాభాలో దాదాపు 21 మిలియన్‌ల మంది శ్రమశక్తి నుంచి తప్పుకున్నారు. కేవలం 9 శాతం మంది ప్రజలే ఉద్యోగాలు చేస్తున్నారని ఆ సంస్థ తెలిపింది. 900 మిలియన్‌ల(90 కోట్లు) పనిచేసే వయస్సు ఉన్న భారతీయులు(దాదాపు అమెరికా, రష్యా జనభాను కలిపితే ఉండేంత మంది) ఇప్పుడు ఉద్యోగాలు చేయాలనుకోవడం లేదని సిఎంఐఇ సంస్థ తెలిపింది.

workforce2
దేశంలో మూడింత రెండొంతుల మంది 15 నుంచి 64 ఏళ్ల వయస్సులో ఉన్నవారే. చిన్న ఉద్యోగానికి సైతం పోటీ తీవ్రంగా ఉంది. స్థిరంగా ఉండే ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెంపర్లాడేవారు లక్షలాదిగా ఉన్నారు. వాస్తవానికి దేశంలో యువత సంఖ్య పెరుగుతోంది. 2030 నాటికి కనీసం 9 కోట్ల కొత్త ఉద్యోగాలైనా కల్పించాల్సి ఉందని మెకిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ 2020 రిపోర్టు పేర్కొంది. అందుకు వార్షిక స్థూల జాతీయ ఉత్పత్తి(జిడిపి) పెరుగుదల 8 శాతం నుంచి 8.5 శాతమైనా ఉండాలి. దేశం ఆర్థిక సరళీకరణ విషయంలో ఎంతో ప్రగతి సాధించినప్పటికీ విదేశీ కంపెనీలు… ఆపిల్ ఇన్‌కార్పొరేషన్, అమేజాన్ డాట్ కామ్ ఇన్‌కార్పొరేషన్‌లా దేశీయ కంపెనీలు లేవు. జనాభా పరంగా సరైన డివిడెండ్‌ను ఇండియా పొందలేకపోతోందని ఆర్థిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే భారతీయులు వయస్సు మీరిపోయినవారు కాగలరేమో కానీ ధనవంతులు కాలేరని వారంటున్నారు.
భారత జనాభాలో మహిళలు 49 శాతం ఉన్నారు. వారు ఆర్థిక ఉత్పత్తిలో కేవలం 18 శాతం మాత్రమే అందిస్తున్నారు. మగవాళ్లు బస్సులు, రైళ్లు పట్టుకుని ఎలాగోలా ఉద్యోగాలకు చేరుకుంటున్నారు. కానీ మహిళల్లో చాలా తక్కువ మందే అందుకు ఇష్టపడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News