Monday, May 20, 2024

బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామా

- Advertisement -
- Advertisement -

Sport Drama

 

1983లో ప్రపంచ క్రికెట్‌లో ఇండియాను విశ్వవిజేతగా నిలిపిన కెప్టెన్ కపిల్‌దేవ్. ఈ అసాధారణ జర్నీని ‘83’ చిత్రంగా దర్శకుడు కబీర్‌ఖాన్ వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ఇక సోమవారం కపిల్‌దేవ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘83’ చిత్ర యూనిట్ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలను తెలియజేసింది. ఈ సందర్భంగా సినిమా షూటింగ్ సెట్‌లో కపిల్‌దేవ్, రణవీర్ సింగ్ కలిసి ఉన్న ఫొటోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ ఫొటోల్లో ఓ దానిలో కపిల్ తన ఫేవరేట్ ఐకానిక్ నటరాజ్ షాట్‌ను ఎలా ఆడేవాడినో గుర్తు చేసుకుంటున్నాడు. అదే షాట్‌ను సినిమాలో రణవీర్ కూడా ఆడి చూపించడం విశేషం. ఈ చిత్రంలో కపిల్‌దేవ్‌లా రణవీర్ సింగ్, సునీల్ గవాస్కర్‌లా తాహిర్ రాజ్‌బాసిన్, కృష్ణమాచారి శ్రీకాంత్‌గా జీవా తదితరులు క్రికెటర్ల పాత్రల్లో నటిస్తున్నారు. బిగ్గెస్ట్ స్పోర్ట్ డ్రామాగా రూపొందుతోన్న ‘83’ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నారు.

Biggest Sport Drama
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News