Tuesday, April 30, 2024

సిఎంనే బెదిరించి లెంపలేసుకున్న స్వామీజీ

- Advertisement -
- Advertisement -

Seer

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ ఎడియూరప్పను బహిరంగంగా బెదిరించిన ఒక స్వామీజీకి రాజకీయ నాయకుల నుంచే కాక సొంత స్వామీజీల నుంచి కూడా గట్టి చివాట్లు పడ్డాయి. బెంగళూరులో హరిహర్‌లో గత మంగళవారం వీరశైవ లింగాయత్ పంచమశాలి మఠం ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎడియూరప్ప కూడా పాల్గొన్నారు. మఠానికి చెందిన వచనానంద స్వామి ప్రసంగిస్తూ రాష్ట్ర క్యాబినెట్‌లో పంచమశాలి కులానికి ప్రాతినిధ్యం పెంచాలని కోరారు. బిల్గి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మురుగేష్ నిరానీ తరఫున లాబీ చేస్తున్న ఆ స్వామీజీ పంచమశాలి కులానికి క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం పెంచకపోతే ఆ కులస్తులంతా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటారని కూడా బెదిరించారు. దీంతో ముఖ్యమంత్రికి చిర్రెత్తింది.

తాను సభ నుంచి వెళ్లిపోతానని ఆయన హెచ్చరించారు.అయితే నిర్వాహకులు నచ్చచెప్పడంతో ఆయన శాంతించారు. కాగా, తనను ఈ రకంగా బెదిరిస్తే తాను రాజీనామా చేస్తానే తప్ప వీటికి లొంగబోనని ఆయన తర్వాత వెల్లడించారు. అయితే, స్వామీజీ రాజకీయాలు మాట్లాడడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వచనాననంద స్వామి ఆ రకంగా హెచ్చరించడాన్ని తాను ఖండిస్తున్నానని స్వయంగా పంచమశాలి మఠ ప్రీఠాధిపతి బసవ జయ మృత్యుంజయ స్వామి ప్రకటించారు. లింగాయత్ పంచమశాలీలకు క్యాబినెట్‌లో తగిన ప్రాతినిధ్యం లేని మాట నిజమే అయినప్పటికీ మరో ఇద్దరికి చోటు కల్పించమని సిఎంకు వినతి పత్రం అందచేశామని ఆయన చెప్పారు. బెదిరింపు ధోరణిలో స్వామీజీ మాట్లాడడం సబబు కాదని, సామీజీలుగా తాము అభ్యర్థిస్తామే తప్ప హెచ్చరికలు జారీ చేయబోమని ఆయన వివరించారు.

విజయపుర ఎమ్మెల్యే బసవరాజ్ యత్నాల్ కూడా ముఖ్యమంత్రిని స్వామీజీ బెదిరించడం తప్పని అన్నారు. రాజకీయాల విషయంలో స్వామీజీలకు దూరంగా ఉండడం ఎవరికైనా మంచిదని, లేకపోతే ప్రతి విషయానికి మఠాల ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే అనూహ్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి కూడా ముఖ్యమంత్రికి ఈ విషయంలో మద్దతు లభించింది. స్వామీజీ అలా మాట్లాడకూడదని, సూచనలు చేయాలే తప్ప బెదిరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇలా ఉండగా హరిహర్‌లో జరిగిన మరో కార్యక్రమంలో బుధవారం పాల్గొన్న వచనానంద స్వామి తన వ్యాఖ్యలతో ప్రజల మనోభావాలు గాయపరిచినందుకు క్షమాపణ కోరారు.

Seer warns Karnataka CM Yediyurappa, People from all walks of life rapped Swamy Vachananda for his warning at CM

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News