Wednesday, May 1, 2024

మహిళా జర్నలిస్టుపై కార్పొరేటర్ దౌర్జన్యం

- Advertisement -
- Advertisement -

Corporator

 

ముంబై: మహారాష్ట్రకు చెందిన ఒక కాంగ్రెస్ కార్పొరేటర్ ఒక మహిళా జర్నలిస్టుపై చేయిచేసుకున్న సంఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలోని మెట్రో స్టేషన్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ సంఘటపై ఆ జర్నలిస్టు వరుస ట్వీట్లతోపాటు ఇందుకు సంబంధించిన వీడియోను సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు. విక్రాంత్ చవాన్ అనే కాంగ్రెస్ కార్పొరేటర్ మెట్రో స్టేషన్‌లో అకారణంగా అక్కడి సిబ్బందితో గొడవపడ్డాడు. ఆ సమయంలో ఆ మహిళా జర్నలిస్టు ఎంతో మర్యాదగా అతడిని వారించగా మధ్యలో జోక్యం చేసుకోవద్దంటూ చవాన్ ఆమెను హెచ్చరించాడు. దీంతో ఆమె ఈ సంఘటనను వీడియోలో రికార్డు చేస్తుండగా అతడు ఆమె చేతిపై కొట్టాడు. కార్పొరేటర్ ప్రవర్తనపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.

 

 

 

 

Congress Corporator hits female journalist, Corporator Vikrant Chavan hits a woman journo at Metro station in Mumbai
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News