Monday, May 20, 2024

సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలి: గవర్నర్

- Advertisement -
- Advertisement -

Tamilisai

హైదరాబాద్: దేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలని, దేశం కోసం ప్రతి పౌరుడూ పాటుపడాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సూచించారు. నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ పేరుతో నిర్వహించిన యూత్ అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని యూత్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆధునిక జీవన శైలిని ఆస్వాదిస్తూనే సంప్రదాయాలను గౌరవించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. యువత ఏ రంగాన్ని ఎంచుకున్నా సంతోషంగా ముందుకు సాగాలని, నవభారత నిర్మాణం కోసం ఉత్సాహంగా పాలు పంచుకోవాలని ఆమె సూచించారు. అనుకున్న రంగంలో రాణించలేన ప్పుడు మరో రంగాన్ని ఎంచుకోవాలి తప్పా, ఆత్మహత్యలు లాంటి చర్యలకు పాల్పడరాదని ఆమె విజ్ఞప్తి చేశారు.

సుభాష్ చంద్రబోస్ యువతకు ఇచ్చిన సందేశాలను గుర్తుచేస్తూ దేశం కోసం, జాతికోసం ప్రతి పౌరుడూ పాటు పడాలని, ఆయన జ్ఞాపకాలు యువతకు నిరంతరం స్ఫూర్తి అందిస్తూనే ఉంటాయని ఆమె తెలిపారు. సుభాష్ చంద్రబోస్ ఇండియన్ గవర్నమెంట్ సర్వీస్ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి 4వ స్థానంలో నిలిచినప్పటికీ స్వతంత్ర భారత్‌లో పని చేయడమే లక్ష్యంగా ఉద్యోగాన్ని వదులుకున్న గొప్పవ్యక్తి అని ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి ఆమె నివాళులర్పించారు.

Tamilisai Said Respect culture and traditions

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News