- Advertisement -
లాస్ ఏంజిల్స్‌లో ఆదివారం రాత్రి 62వ వార్షిక గ్రామీ అవార్డుల ప్రదానం జరిగింది. ఆ ఈవెంట్‌కు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా, నిక్ జోన్స్ హాజరయ్యారు. రెడ్‌కార్పెట్‌పై ప్రియాంకా జిగేల్ మన్నది. మ్యూజిక్ అవార్డ్స్ సెర్మనీకి.. ప్రియాంకా వేసుకువచ్చిన గౌన్ అందర్నీ ఆకట్టుకున్నది. రెడ్ కార్పెట్‌కు ముందు ప్రియాంకా భర్త నిక్ తన ఇన్‌స్టాలో ఓ పోస్టు కూడా చేశారు.
ఇక గ్రామీ అవార్డుల్లో ఈ ఏడాది.. పాప్ స్టార్ బిల్లీ ఎల్లిష్ అవార్డులను క్లీన్ స్వీప్ చేసింది. ఆమెకు అయిదు అవార్డులు దక్కాయి. బెస్ట్ ఆర్టిస్ట్‌తో పాటు సాంగ్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. 18 ఏళ్ల బిల్లీ.. ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును కూడా కైవసం చేసుకున్నది. టేలర్ స్విఫ్ట్ తర్వాత అతిపిన్న వయసులో ఆల్బమ్ అవార్డు గెలుచుకున్న సింగర్‌గా బిల్లీ ఎల్లిష్ చరిత్ర సృష్టించింది.
Priyanka Chopra at Grammy Awards
- Advertisement -