Tuesday, April 30, 2024

ఎపిలో తొలి దిశ కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

First Disha Case

 

ఎక్సైజ్ శాఖ మహిళా ఉద్యోగికి ప్రొఫెసర్ వేధింపులు
‘దిశ’ పోలీసులకు ఫిర్యాదు
ఐదు నిమిషాల్లో నిందితుని పట్టివేత

హైదరాబాద్ : బాలికల, మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం అందుబాటులోకి తెచ్చిన దిశ యాప్ ద్వారా తొలికేసు నమోదైంది. ఎపిలోని పశ్చిమగోదావరి ఏలూరులోమహిళా ఎక్సై జ్ సూపరింటెండెంట్ విశాఖపట్టణం నుం చి విజయవాడకు మంగళవారం తెల్లవారుజామున బస్సులో వెళ్తుండగా అదే బస్సులో వెనుక సీట్లో కూర్చున్న ఓ ప్రొఫెసర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో సదరు మహిళా ఉద్యోగి తన మొబైల్ ఫోన్ లో ఉన్న ’దిశ’ ఎస్‌ఒఎస్ ద్వారా పోలీసులకు వెంటనే సమాచారం అందించింది. సమాచారం వెంటనే ఏలూరు త్రీ టౌన్ పోలీసులకు చేరడంతో కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే బస్సు దగ్గరకు చేరుకుని నిందితుడిని (ప్రొఫెసర్) అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై జీరో ఎఫ్‌ఐఆర్ కింద కేసు నమోదు చేశారు.

పోలీసులకు సిఎం అభినందనలు
దిశ యాప్‌ద్వారా మహిళకు సాయం అం దించిన పోలీసులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో మహిళల భద్రత, దిశ పథకం, దిశ యాప్ అమలు తీరుపై మంగళవారం సిఎం వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డిజిపి గౌతం సవాంగ్‌లతో సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం నుంచి విజయవాడ బస్సులో వస్తున్న మహిళను తోటి ప్రయాణికుడు వేధించడంతో బాధితురా లు దిశయాప్ ద్వారా పోలీసులను ఆశ్రయించారని తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున 4.21 గంటలకు బాధితురాలి నుంచి ఎస్‌ఒఎస్‌కాల్ ద్వారా మంగళగిరి దిశ కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు అందటంతో కాల్‌సెంటర్‌సిబ్బంది వెనువెంటనే సమీపంలోని ఎమర్జెన్సీ టీమ్‌కు సమాచారం అందించారన్నారు. కేవలం 5 నిమిషాల్లోనే ఏలూరు సమీపంలో బస్సువద్దకు దిశ టీమ్‌చేరుకొని వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్‌ను అదుపులోకి తీసుకుని అతనిపై జీరో ఎఫ్‌ఐఆర్‌కేసు నమోదు చేశారని డిజిపి ముఖ్యమంత్రి జగన్‌కు తెలిపారు.

First Disha Case Registration in AP
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News