Tuesday, April 30, 2024

లోదుస్తులకీ ఓ బ్యాంక్

- Advertisement -
- Advertisement -

Useless underwear

 

సాధారణంగా ఉపయోగపడని లోదుస్తులను చెత్తలో పడేస్తుంటాం. కానీ వీటికీ ఓ బ్యాంక్‌ను ఏర్పాటుచేశారు కొన్ని దేశాల్లో. పేద మహిళలకు ఉపాధినివ్వడం కోసం అమెరికా, లండన్, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో పనికిరాని లోదుస్తులను ఓ డ్రాప్ బాక్సులో వేస్తారు. ప్యాడెడ్ లేదా కొన్ని రకాల వస్త్రాలతో చేసిన బ్రాలు భూమిలో అంత త్వరగా కలిసిపోవు. పర్యావరణానికి చేటు చేస్తాయి. అందుకే వీటిని రీసైక్లింగ్ చేయడం, లేదా అవసరం ఉన్న వారికి ఇవ్వడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో బ్యాంక్‌ను ఏర్పాటుచేశాయట ఫ్రీ ద గర్ల్, హాన్స్‌బ్రాండ్స్ వంటి సంస్థలు. వినియోగించని, పాత బ్రాలను వేయడానికి పెద్దపెద్ద దుకాణాల్లో, షాపింగ్ మాల్స్‌లో బ్రా బ్యాంక్, పింక్ క్లాతింగ్ బ్యాంక్ పేరుతో డ్రాప్ బాక్సుల్లో వేసేయొచ్చట. వాటిని సరైన పద్ధతిలో మహిళలే రీసైక్లింగ్ చేస్తారు. అందులోని లోహపు వైర్లని వెలికితీసి విక్రయించి ఉపాధి పొందుతున్నారు. వాడటానికి అనువుగా ఉన్న వాటిని నిరుపేదలకు అందజేస్తారట.

 

Useless underwear is put in drop box
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News