Friday, April 26, 2024

‘ఇండియన్ 2’ సెట్ లో ప్రమాదం.. ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు మృతి, శంకర్ కు గాయాలు

- Advertisement -
- Advertisement -

చెన్నై : తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ హీరోగా క్రీయేటీవ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్-2 మూవీ షూటింగ్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. షూటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ క్రేన్ విరిగిపడి ముగ్గురు మృతి చెందారు. ఇందులో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండగా, మరొకరు డైరెక్టర్ శంకర్ పిఎగా తెలుస్తోంది.  బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో డైరెక్టర్ శంకర్ తోపాటు మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. చెన్నై సమీపంలోని పూందమల్లి వద్దగల ఈవీపీ ఫిలింసిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

2 dead after Crane Collapse in Indian 2 Set at Chennai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News