Saturday, April 27, 2024

వీరశేఖర్ సేనాపతి రీ ఎంట్రీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో లైకా ప్రొడక్షన్స్, రెడ్ జాయింట్ బ్యానర్స్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం భారతీయుడు 2. వీరిద్దరి కాంబినేషన్‌లో 1996లో విడుదలైన బ్లాక్‌బస్టర్ మూవీ ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా ఇప్పుడు భారతీయుడు 2 సినిమా రూపొందుతోంది. శుక్రవారం ఈ సినిమా ఇంట్రో గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. తెలుగులో ఈ గ్లింప్స్‌ను పాన్ ఇండియా డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి రిలీజ్ చేశారు. భారతీయుడు 2 మూవీ ఇంట్రో గ్లింప్స్‌ను గమనిస్తే… ‘భారతీయుడు’లో లంచానికి వ్యతిరేకంగా పోరాడిన వీరశేఖరన్ సేనాపతి ఇండియాలో మళ్లీ తప్పు జరిగితే తాను తిరిగి వస్తానని చెప్పడంతో కథ ముగిసింది. అయితే ఇప్పుడు మళ్లీ దేశంలో లంచగొండితనం పెరిగిపోతోంది. సామాన్యుడు బతకటమే కష్టంగా మారింది.

అప్పుడు భారతీయులందరూ కమ్‌బ్యాన్ ఇండియన్ అంటూ హ్యాష్‌ట్యాగ్ క్రియేట్ చేసి మళ్లీ దేశంలోకి భారతీయుడు అడుగుపెట్టాలని రిక్వెస్టులు పంపుతారు. చివరకు వీరశేఖరన్ సేనాపతి ఇండియాలోకి అడుగుపెడతారు. వచ్చిన తర్వాత సేనాపతి ఏం చేశారు? భారతీయుడికి భయపడి లంచాలు మానేసిన అధికారులు మళ్లీ లంచాలు తీసుకోవడానికి కారణం ఎవరు? పెట్రేగిన లంచం వల్ల దేశంలో ఎలాంటి అల్లకల్లోలాలు జరిగాయి అనే విషయాలను ఈ గ్లింప్స్‌లో చాలా గ్రాండియర్‌గా చూపించారు డైరెక్టర్ శంకర్. ఇదే గ్లింప్స్‌లో కమల్‌హాసన్‌తో పాటు హీరో సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్, రకుల్‌ప్రీత్ సింగ్, ఎస్‌జె సూర్య, బాబీ సింహా తదితరులను చూడవచ్చు. ఈ ఇంట్లో గ్లింప్స్‌ను తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్, హిందీలో మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమిర్ ఖాన్, మలయాళంలో మోహన్‌లాల్, కన్నడలో కిచ్చా సుదీప్ విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News