Tuesday, May 7, 2024

బాలికపై మారు తండ్రి అత్యాచారం… నాలుగు నెలల గర్భవతి

- Advertisement -
- Advertisement -

Rape Girl

 

రాజ్‌కోట్: 16 ఏళ్ల బాలికపై మారు తండ్రి అత్యాచారం చేసి ఆమెను గర్భవతి చేసిన సంఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా నవగమ్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… 15 సంవత్సరాల క్రితం సదరు మహిళ మొదటి భర్త ఆమెతో విడాకులు తీసుకోవడంతో తన మూడేళ్ల కూతురుతో కలిసి జీవిస్తోంది. నేపాల్‌కు చెందిన వ్యక్తి పరిచయం కావడంతో పదమూడు సంవత్సరాల క్రితం ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. బాలిక, మారు తండ్రి , తల్లి ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. గత రెండు సంవత్సరాల నుంచి బాలికను (16) బెదిరిస్తూ ఆమెపై పలుమార్లు మారు తండ్రి అత్యాచారం చేశాడు. బాలికకు గత వారం రోజుల నుంచి జ్వరం వస్తుండడంతో ప్రైవేటు ఆస్పత్రికి తల్లి తీసుకెళ్లింది. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె నాలుగు నెలల గర్భవతి అని చెప్పగానే తల్లికి గుండె ఆగినంత పని అయింది. వెంటనే కూతురుని నిలదీయడంతో మారు తండ్రి తనపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపింది. వెంటనే ఆమె రాజ్ కోట్ మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

 

Step father rape on Girl (16) with her impregnated
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News