Tuesday, May 21, 2024

పేలిన ఎస్‌ఐ తుపాకి.. తోటి ఉద్యోగి మృతి

- Advertisement -
- Advertisement -

 

పోలీస్ స్టేషన్‌లో ప్రమాదవశాత్తు సబ్ ఇన్‌స్పెక్టర్ తుపాకి పేలి తోటి ఉద్యోగి చనిపోయిన ఘటన శుక్రవారం అర్థరాత్రి ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్‌షహర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని బిజేంద్ర సింగ్‌గా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్‌కు చెందిన బిజేంద్ర, బిబినగర్‌లోని పోలీస్ స్టేషన్ రెండో అంతస్థులో నివసిస్తున్నాడు. ఎస్‌ఐ నరేంద్ర పోలీస్ స్టేషన్ వెనుకనున్న క్వార్టర్స్‌లో ఉంటున్నాడు. ఇద్దరు బిబినగర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నరేంద్ర వాష్‌రూమ్ కోసం శుక్రవారం రాత్రి 11.45 గంటలకు బిజేంద్ర రూమ్‌కు వెళ్లాడు. తన లోడెడ్ సర్వీస్ రివాల్వర్‌ను అక్కడున్న టేబుల్‌పై పెట్టి వాష్‌రూమ్‌కు వెళ్లాడు. ప్రమాదవశాత్తు ఆ తుపాకి పేలడంతో పక్కనే ఉన్న బిజేంద్ర కడుపులోకి బుల్లెట్ దూసుకుపోయాయి. దీంతో బిజేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే నరేంద్ర అతనిని చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించాడు. అనంతరం అక్కడి నుంచి నరేంద్ర పారిపోయాడు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్ సంతోష్ సింగ్, బిబినగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని పరిశీలించగా ఎస్‌ఐ నరేంద్ర పారిపోయినట్లు తెలిసింది. దీంతో సంతోష్ సింగ్ అందించిన సమాచారంతో ఘజియాబాద్ పోలీసులు అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో నరేంద్రను అరెస్టు చేశారు.

UP Cop Killed after SI gun accidentally went off

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News