Wednesday, May 1, 2024

కరోనా కట్టడికి పంచ సూత్రాలు

- Advertisement -
- Advertisement -

Five principles for corona control

 

హైదరాబాద్: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో ప్రజలు తమ దైనందిన జీవితాన్ని యథావిధిగా కొనసాగిస్తూనే కరోనా కాటుకు గురికాకుండా ఎలా స్వీయ రక్షణ పొందవచ్చో వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఐదు మార్గదర్శకసూత్రాలను పాటించడం వల్ల కరోనా వైరస్ సోకకుండా తమను తాము కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు తెలియచేస్తున్నారు. అవి ఏమిటంటే..

1. మీరు సురక్షితంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలంటే మీరు నివసిస్తున్న రాష్ట్రం లేదా నగరంలో గడచిన రెండు వారాలుగా కరోనాబారిన పడుతున్న రోగుల సంఖ్య 5 శాతం లేదా అంతకన్నా తక్కువ ఉంటే వైరస్‌ను కట్టడి చేయడానికి పరీక్షలు సమృద్ధిగా జరుగుతున్నట్లే భావించాలి.

2. ఇతరులతో సన్నిహితంగా మెలగకండి. మీ కుటుంబ సభ్యులతో గడపడమే మీకు సురక్షితమని భావించండి. ఒకవేళ మరికొంత మంది సన్నిహితులతో గడపదలచుకుంటే రెండు, మూడు కుటుంబాలతో కలసి ఒక క్వారెంటైన్ జట్టుగా ఏర్పడి, తగిన రక్షణ చర్యలు అందరూ తీసుకుంటూ గడపండి.

3. సాధ్యమైనంత వరకు జనసమూహంలోకి రాకండి. మీ కార్యకలాపాలను ప్రణాళికాబద్ధంగా నిర్ణయించుకోండి. డిన్నర్ పార్టీలు, క్షౌరశాలకు వెళ్లడం వంటివి అంత సురక్షితం కావు. రద్దీ తక్కువగా ఉండే కిరాణా షాపులలో కొనుగోళ్లే కొంతవరకు సురక్షితం.

4. అత్యవసరంగా బయటకు వెళ్లవలసి వస్తే ఓపెన్ స్పేస్ ఉండే విధంగా చూసుకోవాలి. తక్కువ సంఖ్యలో జనం ఉండే ప్రదేశాలే సురక్షితం. ఇన్‌డోర్ కార్యక్రమాలలో గంటకన్నా ఎక్కువ సేపు గడపకూడదు. ఎవరితోనైనా మాట్లాడే సమయంలో మాస్కులు ధరించడం తప్పనిసరి.

5. భౌతిక దూరం పాటించడం, తరచు చేతులను శుభ్రంగా కడుక్కోవడం, మాస్కులు ధరించడం అన్న మూడు నియమాలు జీవితంలో భాగంగా మారిపోవాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News