బార్బడోస్: ప్రపంచ క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోనీ అతి పెద్ద స్టార్ అని వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు లభించిన ఆణిముత్యాల్లో ధోనీదే అగ్ర స్థానం అనడంలో సందేహం లేదన్నాడు. జింబాబ్వే క్రికెటర్ పామీ బంగ్వాతో జరిగిన ఇన్‌స్టా లైవ్ చాట్‌లో బ్రావో పాల్గొన్నాడు. ఈ సందర్బంగా టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీతో తనకున్న అనుబంధాన్ని బ్రావో అభిమానులతో పంచుకున్నాడు. ధోనీలాంటి ఆటగాడు అతి అరుదుగా లభిస్తాడన్నాడు. కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా అతను పోషించే పాత్ర తనను కట్టి పడేస్తుందన్నాడు. యువ క్రికెటర్లకు అండగా నిలువడంలో ధోనీకి ఎవరూ సాటిరారన్నాడు. అంతేగాక ఒత్తిడిలోనూ నిబ్బరంగా ఉంటూ జట్టును విజయపథంలో నడిపించే సత్తా ఒక్క మహికి మాత్రమే ఉందన్నాడు.
ధోనీలాంటి ఆటగాడితో కలిసి చెన్నై సూపర్ కింగ్స్‌లో ఆడడాన్ని అరుదైన అదృష్టంగా భావిస్తానని తెలిపాడు. ఇక, కరోనా వల్ల అర్ధాంతరంగా నిలిచి పోయిన ఐపిఎల్ మళ్లీ జరుగుతుందనే నమ్మకం తనకుందన్నాడు. కరోనా తగ్గు ముఖం పడితే టోర్నీ నిర్వహించేందుకు బిసిసిఐకి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నాడు. ఇక, ప్రపంచ వ్యాప్తంగా నల్ల జాతీయులపై జరుగుతున్న దాడులపై కూడా బ్రావో స్పందించాడు. అమెరికాలో పోలీసుల చేతిలో అమాయక నల్ల జాతీయుడు బలి కావడంతో ఎంతో బాధించిందని బ్రావో వాఓయాడు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూడాలని సూచించాడు.
Dhoni big superstar in World Cricket: dwayne bravo