Saturday, May 11, 2024

ఈ రెండు లక్షణాలు ఉంటే కూడా కరోనానే..

- Advertisement -
- Advertisement -

Covid-19

న్యూఢిల్లీ: కరోనా లక్షణాల్లో మరో రెండు వచ్చి చేరాయి. వాసన గ్రహించక పోవడం (అనోస్మియా), రుచి తెలుసుకోలేక పోవడం (ఎగూసియా) ఈ రెండు లక్షణాలు కూడా కరోనాను గుర్తించ గలిగే లక్షణాలుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనాను గుర్తించడానికి జ్వరం, దగ్గు, అలసట, ఊపిరాడక పోవడం, కేకరింత, గొంతునొప్పి, డయేరియా లక్షణాలుగా ఇంతవరకు మనకు తెలిసిందే. జనవరిలో కరోనా మొదటి సారి బయటపడినప్పుడు జ్వరం, దగ్గు, ఊపిరాడక పోవడం లక్షణాలుగా వైద్య నిపుణులు పేర్కొన్నారు.

మేలో డయేరియా, వాంతులు వంటి జీర్ణకోశ వ్యాధులను కరోనా లక్షణాలుగా జత చేశారు. ప్రస్తుతం మొత్తం 13 లక్షణాలు కరోనా గుర్తించడానికి సూచించగా ఇప్పుడు మరో రెండు చేరడంతో మొత్తం 15 లక్షణాలు జాబితాలో చేరాయి. జ్వరం, దగ్గు, డయేరియా, వాంతులు, కడుపునొప్పి, శ్వాస ఇబ్బందులు, వికారం, దగ్గితే రక్తం పడడం, కండరాల నొప్పులు, గొంతు మంట, ఛాతీ నొప్పి, వికారంతో కఫంతోపాటు వాసన, రుచి తెలియక పోవడం లక్షణాలు కనిపిస్తే రోగి తెలియచేయవలసి ఉంటుంది.

ICMR recognised New features on Covid-19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News