Tuesday, April 30, 2024

ఎస్ఐని బూతులు తిట్టిన వాలంటీర్ (వీడియో వైరల్ )

- Advertisement -
- Advertisement -

Volunteer scold Lady Sub Inspector

అమరావతి: ఓ మహిళా ఎస్‌ఐని వాలంటీర్ బండ బూతులు తిట్టిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగింది. ఆత్మకూరులోని 21వ వార్డుకు చెందిన ఓ వాలంటీర్ మద్యం సేవించి వాహనం నడుపుతుండగా మహిళ ఎస్‌ఐ రోజాలత తన సిబ్బందితో కలిసి వాహనం ఆపింది. వెంటనే వాలంటీర్ బైక్ పైనుంచి దిగి ఎస్‌ఐని అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు. ఎస్‌ఐ అంతుచూస్తానంటూ బెదిరించాడు. అతడితో మరో వాలంటీర్ భర్త కూడా ఉన్నాడు. వెంటనే సిఐ పాపారావు ఆ ఇద్దరుపై కేసు నమోదు చేశాడు. మరుసటి రోజు సిఐ బదిలీ అయ్యాడు. గతంలో చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం గూడూరుపల్లెలో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై గ్రామ వాలంటీర్ నరేష్ అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఏదో ఒక చోట వాలంటీర్లు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

https://www.youtube.com/watch?v=xgWsN1WeJDI

 

Courtesy by Telugu trending

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News